Sheryl Sandberg : వ్యాపారిని పెళ్లాడిన షెరిల్ శాండ్ బ‌ర్గ్

షెరిల్ ఫేస్ బుక్ మాజీ ఎగ్జిక్యూటివ్

Sheryl Sandberg : ప్రపంచ సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్ బుక్ మాజీ ఎగ్జిక్యూటివ్ షెరిల్ శాండ్ బ‌ర్గ్ పెళ్లి చేసుకుంది. ఆమె అమెరికాకు చెందిన ప్ర‌ముఖ న్యూస్ ప్రొడ్యూస‌ర్, వ్యాపార వేత్త‌ను వివాహం చేసుకుంది.

ఇదిలా ఉండ‌గా ఈ ఏడాది ప్రారంభంలో షెరిల్ శాండ్ బ‌ర్గ్ 2022 చివ‌రలో మెటాకు చెందిన కీల‌క ప‌ద‌వి నుండి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఈ జంట త‌మ పెళ్లికి సంబంధించిన అంద‌మైన ఫోటోను ఇన్ స్ట్రా గ్రామ్ లో పోస్ట్ చేసింది. మాజీ మెటా చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ (కూ) షెరిల్ శాండ్ బ‌ర్గ్ వ్యాపార‌వేత్త టామ్ బెర్నాల్ ను వ్యోమింగ్ లో స‌న్నిహిత వేడుక‌లో ఒక్క‌ట‌య్యారు.

బెర్నాల్ మాజీ ఎన్బీసీ న్యూస్ ప్రొడ్యూస‌ర్ గా ప‌ని చేశారు. క‌న్స‌ల్టింగ్ సంస్థ కెల్ట‌న్ గ్లోబ‌ల్ వ్య‌వ‌స్థాప‌కుడు కూడా. న‌టుడు జోన్ బెర్నాల్ కు సోద‌రు అయిన వ్యాపార‌వేత్త‌గా ఉన్నారు.

మేమిద్దరం ఒక‌రినొక‌రం అర్థం చేసుకున్నాం. షెరిల్ శాండ్ బ‌ర్గ్ ను నేను పెళ్లి చేసుకుంటాన‌ని అనుకోలేదు. గత మూడు సంవ‌త్స‌రాలుగా మేము మా జీవితాల‌ను ఒక‌రినొక‌రం అర్థం చేసుకునే ప్ర‌య‌త్నం చేశామ‌ని వీరిద్ద‌రూ తెలిపారు.

ఇవాళ ఆనాటి క‌ల నిజ‌మైంద‌ని పేర్కొన్నారు షెరిల్ శాంబ్ బ‌ర్గ్(Sheryl Sandberg) , టామ్ బెర్నాల్. ఇదిలా ఉండ‌గా షెరిల్ శాండ్ బ‌ర్గ్ స‌ర్వే మంకీ సిఇఓ డేవ్ గోల్డ్ బెర్గ్ ను పెళ్లి చేసుకున్నారు.

ఆయ‌న 47 ఏళ్ల వ‌య‌స్సులో మ‌ర‌ణించారు. మ‌రో వైపు బెర్నాల్ కూడా త‌న పెళ్లిని విడాకుల‌తో ముగించారు.

Also Read : పేటీఎం చీఫ్ గా విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ

Leave A Reply

Your Email Id will not be published!