Shikhar Dhawan : తండ్రి దాడితో శిఖర్ ధావన్ పరేషాన్
పంజాబ్ ఓటమిపై ఆగ్రహం
Shikhar Dhawan : శిఖర్ ధావన్ పరిచయం అక్కర్లేని పేరు. భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మొన్నటి దాకా ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడాడు. తాజాగా ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు.
ఈ వెటరన్ ఓపెనర్ కంటిన్యూగా ఐపీఎల్ లో రాణిస్తూ వచ్చాడు. ఈసారి కూడా పరుగుల వరద పారించాడు. కానీ తాను ఆడిన పంజాబ్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరకుండానే ఐపీఎల్ రిచ్ లీగ్ నిష్క్రమించింది.
ఇదే సమయంలో పుల్ ఫామ్ లో ఉన్న శిఖర్ ధావన్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలెక్షన్ కమిటీ స్వదేశంలో జరిగే సౌతాఫ్రికా
5 మ్యాచ్ ల టీ20 సీరీస్ కు , ఇంగ్లండ్ ఆడే ఏకైక టెస్టుకు ఎంపిక చేయలేదు.
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. శిఖర్ ధావన్(Shikhar Dhawan) ను కేఎల్ రాహుల్ కావాలనే వద్దన్నాడని ఈ విషయం హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తో చెప్పించాడని ప్రచారం జరిగింది.
ఇదిలా ఉండగా అటు ఐపీఎల్ లో రాణించినా పంజాబ్ ఓడి పోవడం, ఇటు ఎంపిక అవుతాడని అనుకున్న ధావన్ జాతీయ జట్టుకు ఎంపిక కాక
పోవడంతో తండ్రికి కోపం వచ్చింది.
ఏకంగా శిఖర్ ధావన్ పై దాడికి దిగాడు. ఆయనను కొట్టినంత పని చేశాడు. ప్రస్తుతం దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోను శిఖర్ ధావన్
తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఫోటోలు, వీడియోలు. అయ్యో శిఖర్ ధావన్(Shikhar Dhawan) కు ఎంత ఇబ్బంది
ఏర్పడిందంటూ నెటిజన్లతో పాటు తాజా, మాజీ ఆటగాళ్లు సైతం వాపోతున్నారు.
మరికొందరైతే సెలక్టర్లను తిడుతున్నారు. ఇదిలా ఉండగా ఇదంతా సరదా కోసం చేసిందేనంటూ పేర్కొనడం తో అంతా విస్తు పోయారు.
దీనిపై మాజీ క్రికెటర్, ప్రస్తుత ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ అయితే శిఖర్ తండ్రి దాడిని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు.
Also Read : సంగక్కర ప్లాన్ వర్కవుట్ అవుతుందా