Shikhar Dhawan : ఈనెల 26 నుంచి ఐపీఎల్ సంబురం ప్రారంభం కానుంది. ఏప్రిల్ లో ఈ రిచ్ లీగ్ ముగియనుంది. ఇప్పటికే అన్ని జట్లు ఫుల్ ప్రాక్టీస్ లో మునిగి పోయాయి.
ఈ సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ (cricketer Shikhar Dhawan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన రక్తంలో అణువణువునా పంజాబ్ రక్తం ప్రవహిస్తోందని అన్నారు.
ఈసారి ఐపీఎల్ మెగా వేలం (IPL mega auction) పాటలో ఢిల్లీ క్యాపిటల్స్ కాకుండా పంజాబ్ కింగ్స్ ఎలెవన్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan )ను చేజిక్కించుకుంది (Punjab kings XI). ఈ సందర్బంగా ఐపీఎల్ లో సత్తా చాటేందుకు తాను సిద్దంగా ఉన్నానని పేర్కొన్నాడు.
ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నానని, తనతో పాటు మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేస్తాడని చెప్పాడు. తమ జోడి రాణిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశాడు శిఖర్ ధావన్.
ఈసారి ఎలాగైనా సరే పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందన్నాడు. ఇప్పటి దాకా తనను ఢిల్లీ అనుకుంటారని కానీ తన రెండో నివాసం పంజాబ్ అని పేర్కొన్నాడు.
తన శరీరం ఢిల్లీలో ఉంటే ఆత్మ పంజాబ్ లో ఉందన్నాడు శిఖర్ ధావన్(Shikhar Dhawan ). ఇదిలా ఉండగా బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం (IPL mega auction) లో శిఖర్ ధావన్ ను తీసుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి.
కానీ పంజాబ్ కింగ్స్ యాజమాన్యం రూ. 8.23 కోట్లకు తీసుకుంది. పంజాబ్ తరపున ప్రాతినిధ్యం వహించ బోతున్నందుకు తనకు ఆనందంగా ఉందన్నాడు శిఖర్ ధావన్. ఈ ఆసక్తికర వ్యాఖ్యల్ని శిఖర్ ధావన్ ఫౌండేషన్ ను ప్రారంభిస్తూ చెప్పాడు.
Also Read : బాబర్ ఆజమ్ అరుదైన రికార్డ్