Rohit Sharma : భారత క్రికెట్ జట్టు స్కిప్పర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సఫారీ టూర్ లో గాయం కారణంగా ఆడలేక పోయినీ స్టార్ ప్లేయర్ తొలిసారిగా ఫుల్ టైమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
స్వదేశంలో వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సీరీస్ లో ఫస్ట్ , రెండో వన్డేలు గెలుపొందింది సీరీస్ చేజిక్కించుకుంది. రెండో వన్డేలో భారత బౌలర్ ప్రసిద్ధ కృష్ణ తక్కువ పరుగులు ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు తీశాడు.
భారత జట్టు 237 పరుగులు చేస్తే విండీస్ టార్గెట్ ఛేదించ లేక ఆలౌటైంది. 44 పరుగుల తేడాతో ఓడి పోయింది. దీంతో మ్యాచ్ విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)మీడియాతో మాట్లాడారు.
రేపు మూడో వన్డే జరుగబోతోంది. మేం ప్రయోగాలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని పేర్కొన్నాడు. ఈ విషయంలో తాము గెలుపు ఓటముల గురించి పట్టించుకోమని స్పష్టం చేశాడు.
భారత జట్టు వన్డే చరిత్రలో అరుదైన రికార్డు సాధించింది. అహ్మదాబాద్ వేదికగా 1000 వన్డే మ్యాచ్ లు పూర్తి చేసింది. వన్డే జట్టుకు నాయకుడిగా సీరీస్ కైవసం చేసుకోవడం సంతోషం కలిగించింది.
కేఎల్ రాహుల్ రెండో వన్డేకు అందుబాటులోకి వచ్చినా ఎందుకనో రిషబ్ పంత్ ను ఓపెనర్ గా పంపించాడు. 18 పరుగులు చేసినా ఇలాంటి ప్రయోగాలు ఇక ముందు కూడా ఉంటాయని స్పష్టం చేశాడు.
ఇదే సమయంలో కీలక కామెంట్స్ చేశాడు రోహిత్ శర్మ(Rohit Sharma). శిఖర్ ధావన్ సేవలను వాడుకుంటామని చెప్పాడు. అతడు జట్టుకు కావాలన్నాడు.
Also Read : మెరిసిన మిథాలీ..మంథాన