Japan Ruling Party Win : జపాన్ ఎన్నికల్లో షింజో కూటమి విక్టరీ
76 సీట్లు కైవసం చేసుకున్న ఎల్డీపీ కూటమి
Japan Ruling Party Win : జపాన్ దేశానికి దిశా నిర్దేశం చేస్తూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించాడు దారుణ హత్యకు గురైన మాజీ ప్రధానమంత్రి షింజో అబే.
తాజాగా దేశంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్బంలో ఓ దుండుగాడి దుశ్చర్యకు కుప్ప కూలాడు. ఇదిలా ఉండగా దేశంలో జరిగిన ఎన్నికల్లో దివంగత దిగ్గజ నాయకుడు మాజీ ప్రధాన మంత్రి షింజో అబే కు(Japan Ruling Party Win) చెందిన పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది .
షింజో మరణించిన రెండు రోజులకే దుమ్ము రేపింది. సత్తా చాటింది. అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) – కొమైటో కూటమి క్లీన్ స్వీప్ చేసింది.
దీంతో ఎగువ సభలో 76 సీట్లు కైవసం చేసుకుంది. తిరుగులేని మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించింది. జపాన్ వాసులు షింజే అబే కూటమికే ఘన విజయాన్ని కట్టబెట్టారు.
ప్రచారంలో పాల్గొన్న సందర్భంలో నరా నగరంలో షింజే కాల్చివేతకు గురయ్ఆయడు. షింజో అబే మరణం నుంచి జపాన్ దేశ ప్రజలు ఇంకా కోలుకోలేదు. ప్రధాని ఫుమియో కిషిదా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను ప్రకటించారు.
వారి పేర్లను వెల్లడిస్తూ ప్రతి ఒక్కరి పక్కన గులాబీ పుష్పాలు ఉంచారు. కిషిదా ప్రకటించిన సమయంలోనూ కన్నీటి పర్యంతం అయ్యారు. గెలిచిన ఆనందం ఎవరిలోనూ కనిపించ లేదు.
హింసోన్మాదం పెచ్చరిల్లినా చివరకు శాంతి వైపే ప్రజలు ఉన్నారని నిరూపించారు. ఆరు నూరైనా హింస తప్పని నిరూపించేందుకే ఈ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిందని చెప్పారు కిషిదా.
Also Read : బ్రిటన్ ప్రధాని రేసులో లిజ్ ట్రస్