Shivam Dube : శివమెత్తిన శివమ్ దూబే

ఆర్సీబీకి బ్యాట‌ర్ చుక్క‌లు

Shivam Dube : బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ప‌రుగుల వర‌ద పారింది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో బ‌లంగా ఉన్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య హోరా హోరీ పోరు న‌డించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన మ‌హేంద్ర సింగ్ ధోనీ సేన ఆదిలోనే రుతు రాజ్ గైక్వాడ్ వికెట్ ను కోల్పోయింది.

అనంత‌రం మైదానంలోకి వ‌చ్చిన అజింక్యా ర‌హానే చిత‌క్కొట్టాడు. కేవ‌లం 20 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న ర‌హానే 2 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో చిత‌క్కొట్టాడు. 37 ర‌న్స్ చేశాడు. ఇక ఓపెన‌ర్ డెవాన్ కాన్వే ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. 83 ర‌న్స్ చేశాడు.

ఈ త‌రుణంలో క్రీజులోకి వ‌చ్చిన యువ క్రికెట‌ర్ శివ‌మ్ దూబే పూన‌కం వ‌చ్చిన వాడిలా రెచ్చి పోయాడు. ర‌హానే వికెట్ ను తీసిన ఆనందం ఆదిలోనే ఆవిరై పోయింది. ఓ వైపు కాన్వే ఇంకో వైపు శివమ్ దూబే(Shivam Dube) దంచి కొట్టాడు. కేవ‌లం 27 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న దూబే 2 ఫోర్లు 5 క‌ళ్లు చెదిరే సిక్స‌ర్ల‌తో మోత మోగించాడు. 52 ప‌రుగులు చేయ‌డంతో చెన్నై సూప‌ర్ కింగ్స్ నిర్ఱీత 20 ఓవ‌ర్ల‌లో 226 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

అనంత‌రం బ‌రిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 218 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. దీంతో 8 ప‌రుగుల తేడాతో చెన్నై సూప‌ర్ కింగ్స్ గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది.

Also Read : అజింక్యా ర‌హానే స్ట‌న్నింగ్ ఫీల్డింగ్

Leave A Reply

Your Email Id will not be published!