Shivraj Singh Chouhan : న్యూ ఢిల్లీ భూపాల్ రైలులో ప్రయాణించిన కేంద్రమంత్రి

ఈ క్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్స్ ఫేజ్ లో వీరిద్దరిపై ప్రశంసల వర్షం కురిపించాడు...

Shivraj Singh Chouhan : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఆయన తన భార్యతో కలిసి న్యూఢిల్లీ నుంచి భోపాల్‌కు ఈ రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణికులను ఉద్దేశించి మాట్లాడారు. పలువురు ప్రయాణికులు ఆయనతో సెల్ఫీలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన X వేదికపై పోస్ట్ చేశారు.

Shivraj Singh Chouhan Visit

భారతీయ రైల్వేలో విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సూచన, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దార్శనికత ఈ మార్పుకు కారణం. ఈ క్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్స్ ఫేజ్ లో వీరిద్దరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan) మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి భారీ విజయంలో కీలక పాత్ర పోషించారు. విదిశా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన చౌహాన్ 8 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. మోదీ కేబినెట్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇటీవలే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ను నియమిస్తారని నిన్నటి వరకు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

Also Read : India vs Canada : జీ7 సమ్మిట్ తో మోదీని కలిసి స్వరం మార్చిన ‘జస్టిన్ ట్రూడో’

Leave A Reply

Your Email Id will not be published!