Shoaib Akhter : కోహ్లీ..రోహిత్ రాణించక పోతే కష్టం
షోయబ్ అక్తర్ సంచలన కామెంట్స్
Shoaib Akhter : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఐపీఎల్ లో వీరిద్దరూ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. కెప్టెన్ గా , బ్యాటర్ గా రోహిత్ శర్మ రాణించ లేక పోయాడు.
ఇక ఆర్సీబీ తరపున ఆడిన కోహ్లీ పూర్తిగా నిరాశ పరిచాడు. గత రెండు సంవత్సరాల నుంచి కోహ్లీ నుంచి ఒక్క అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన పాపాన పోలేదు.
దీంతో త్వరలో జరిగే సౌతాఫ్రికా, ఇంగ్లండ్ , విండీస్ తో పాటు ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ జరగనున్నాయి. ఈ తరుణంలో వీరిద్దరూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
ఈ విషయం గురించే ప్రత్యేకంగా ప్రస్తావించాడు పాకిస్తాన్ మాజీ స్టార్ పేసర్ షోయబ్ అక్తర్(Shoaib Akhter). తన యూట్యూబ్ చానల్ లో వీరిద్దరి గురించి స్పందించాడు.
పరుగుల లేమితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఏ మాత్రం రాణించక పోతే మాత్రం జట్టులో కొనసాగడం కష్టమన్నారు. ఇందుకు ఉదాహరణగా అజింక్యా రహానేను పేర్కొన్నాడు అక్తర్.
ఒకవేళ కోహ్లీ, రోహిత్ కు ఇదే చివరి వరల్డ్ అని స్పష్టం చేస్తే మరింత ఒత్తిడికి లోనవుతారని హెచ్చరించాడు. ఇద్దరూ అద్భుతమైన బ్యాటర్లు అని కానీ ఎంత గొప్ప ప్లేయర్లయినా ఆడేంత వరకే నని పేర్కొన్నాడు.
ఒకవేళ ప్రదర్శన బాగా లేక పోతే జట్టులో కొనసాగడం కష్టమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు షోయబ్ అక్తర్(Shoaib Akhter). స్టార్ ప్లేయర్ గా పేరొందిన సచిన్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడని తెలిపాడు.
Also Read : శ్రీలంక జట్టు బౌలింగ్ కోచ్ గా మలింగ