MLC Kavitha ED : ఎమ్మెల్సీ కవితకు షాక్..ఈడీ రిపోర్టులో పేరు
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కు దెబ్బ
MLC Kavitha ED : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజు రోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కీలక నిందితుడిగా భావిస్తున్న అమిత్ అరోరా విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనుచరుడిగా పేరున్న బోయినపల్లి అభిషేక్ రావుతో పాటు అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డిలను అరెస్ట్ చేశారు.
బుధవారం అమిత్ అరోరాను అరెస్ట్ చేయడం, ఇందుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha ED) పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం ఆమె పేరు ఇరు తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపింది. ఆప్ కు కమీషన్ల కోసమే అత్యధికంగా మార్జిన్ పెట్టారంటూ ఆరోపించారు.
విచిత్రం ఏమిటంటే కవిత 10 ఫోన్లను మార్చారని ఇందులో స్పష్టం చేసింది. ఆప్ నుంచి విజయ్ నాయర్ కు రూ. 100 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు తెలిపారు. దక్షిణాది గ్రూపులో ఎమ్మెల్సీ కవితతో పాటు ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి ఉన్నారని రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా గత ఏడాది 2021 సెప్టెంబరర్ 1న ఒకే రోజు సీఏ బుచ్చిబాబు, అభిషేక్ రావు బోయినపల్లి, కవిత ఫోన్లు మార్చారంటూ ప్రస్తావించడం విశేషం. 153 ఫోన్లు వాడారని వాటిని ధ్వంసం చేశారని పేర్కొనడం విస్తు పోయేలా చేసింది. అమిత్ అరోరా 11 ఫోన్లు, కవిత 10 ఫోన్లు ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారంటూ ఆరోపించింది ఈడీ.
ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా సన్నిహితుల్లో ఒకడిగా పేరొందారు అమిత్ అరోరా.
Also Read : అమ్మో కవిత మామూలు లేదుగా