Gautam Adani : అందనంత దూరంలో అదానీ
బెజోస్ ..ఎలోన్ మస్క్ కు బిగ్ షాక్
Gautam Adani : భారతీయ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతం అదానీ అందనంత దూరంలో పరుగులు తీస్తున్నారు. ఓ వైపు ప్రపంచ కుబేరులు ఒడిదుడుకులకు లోనవుతుంటే మరో వైపు అదానీ గ్రూప్ మాత్రం రంకెలు వేస్తోంది.
స్టాక్ మార్కెట్ లలో తమ మదుపరులకు భారీ లాభాలను తెచ్చి పెట్టేలా చేస్తోంది. దీంతో ఉన్నట్టుండి మనోడి ఆదాయం గణనీయం పెరుగుతోంది. ఇక వరల్డ్ వైడ్ బిలియనీర్ల జాబితాలలో ఇతరను నెట్టేసి ముందుకు దూసుకెళుతున్నారు అదానీ(Gautam Adani).
విచిత్రం ఏమిటంటే నిన్నటి దాకా టాప్ లో నిలిచిన అమెజాన్ చీఫ్ బెజోస్ ఉన్నట్టుండి కిందకు జారారు. రూ. 12,460 కోట్లు ఆర్జించాడు. ఇప్పటి దాకా మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన తదుపరి ఫోకస్ రెండో స్థానంపై నిలిచి ఉంది.
ఆ స్థానాన్ని చేజిక్కించుకునే పనిలో పడ్డారు. సెప్టెంబర్ 14 నాటికి గౌతమ్ అదానీ ఆస్తి రూ. 158 కోట్ల డాలర్లు. మొత్తం ఆదాయం రూ. 11.76 లక్షల కోట్లుగా ఉంది. ఇక బెజోస్ 15,000 కోట్ల డాలర్లకు చేరుకుంది.
దీంతో ఇద్దరి మధ్య రూ. 25,000 కోట్లకు తగ్గింది. దీంతో త్వరలోనే బెజోస్ ను వెనక్కి నెట్టేందుకు మనోడు రెడీగా ఉన్నాడన్నమాట. ప్రస్తుతానికి గౌతమ్ అదానీ(Gautam Adani) కంటే ముందు అమెజాన్ సిఇఓ, చైర్మన్ బెజోస్ , టెస్లా సిఇఓ , చైర్మన్ ఎలోన్ మస్క్ మాత్రమే ఉన్నారు.
ఈ ఇద్దరి కుబేరులను దాటాలంటే గౌతమ్ అదానీ ఆస్తుల విలువ కొంత మేరకు పెరగాల్సి ఉంది. ఇక మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం త్వరలోనే టాప్ లోకి భారతీయ వ్యాపారవేత్త చేరుకోవడం ఖాయమని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : చిప్ కంపెనీ ఏర్పాటు మా నిర్ణయం – చైర్మన్