Shreya Lenka : టాప్ పాప్ స్టార్ గా శ్రేయ లెంక ఎంపిక
కొరియన్ పాప్ స్టార్ గా అరుదైన ఘనత
Shreya Lenka : భారత దేశానికి చెందిన అతి పిన్న వయస్కురాలైన శ్రేయ లెంకా అరుదైన ఘనతను సాధించింది. కొరియన్ పాప్ స్టార్ గా అవతరించింది.
ఆమెకు 18 ఏళ్ల వయస్సు. కొరియన్ పాప్ బ్యాండ్ బ్లాక్ స్వాన్ లో భాగంగా శ్రియా లెంకా(Shreya Lenka) ఎంపికైంది. ఇదిలా ఉండగా భారత్ నుంచి తొలి పాప్ స్టార్ గా అవతరించింది. కాగా శ్రియ లెంక ప్రాక్టీస్ కోసం కొన్ని నెలల పాటు సియోలలో ఉంటోంది.
శ్రేయ లెంక స్వస్థలం ఇండియా లోని ఒడిశా. లెంకా బ్రెజిల్ కు చెందిన గాబ్రియేలా డాల్సిన్ తో పాటు కొరియన్ పాప్ బ్యాండ్ బ్లాక్ స్వాన్ లో భాగంగా ఎంపిక చేయబడింది.
గత 6 నెలలుగా గ్లోబల్ ఆడిషన్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న తర్వాత శ్రేయ లెంక , గాబ్రియేలా ఎట్టకేలకు బ్లాక్ స్వాన్ లో సభ్యులుగా ఎంపికైనట్లు డాక్టర్ మ్యూజిక్ ఒక పోస్ట్ లో పేర్కొంది. బ్లాక స్వాన్ 2020లో అరంగేట్రం చేసింది.
ఇప్పుడు ఈ గ్రూపులో ఆరుగురు సభ్యులు ఉన్నారు. యంగ్ హ్యూన్ , ఫాటౌ, జూడీ, లియా, శ్రేయ లెంక , గాబ్రియేలా. ది న్యూస్ ఇన్ సైట్ ప్రకారం శ్రీయా లెంక రూర్కెలాలో 2003 లో పుట్టింది.
ఆమె హిందూస్తానీ క్లాసికల్ తో పాటు ఒడిస్సీ , ఇతర సమకాలీన నృత్యాలలో శిక్షణ పొందింది. నాకు లోతైన స్వరం ఉంది. సరైన స్వర శిక్షకుడిని కనుగొనడంలో నేను ఇబ్బంది పడ్డాను.
ఒకరిని కనుగొనడంలో మా అమ్మమ్మ నాకు సహాయం చేసిందన్నారు శ్రేయ లెంకా. పాప్ స్టార్ గా ఎంపికైన శ్రియా లెంక(Shreya Lenka) ను పలువురు అభినందిస్తున్నారు.
Also Read : యూత్ కి మత్తెక్కించే ఫోజులతో మాళవిక శర్మ