Shreyas Iyer : కేకేఆర్ గెలుపులో ఉమేష్ కీల‌కం

కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కామెంట్

Shreyas Iyer : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా జ‌రిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ప్ర‌ధానంగా టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (Shreyas Iyer)ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఈ త‌రుణంలో బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాట‌ర్లు ఏ ఒక్క‌రు ప్ర‌తిఘ‌టించ లేక పోయారు. ప‌రుగులు చేసేందుకు నానా తంటాలు ప‌డ్డారు. అయితే బౌలింగ్ ప‌రంగా ఉమేష్ యాద‌వ్ అద్భుత‌మైన బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నాడు.

ఏకంగా నాలుగు కీల‌క వికెట్లు తీసి పంజాబ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. అనంత‌రం మైదానంలోకి వ‌చ్చిన కేకేఆర్ 51 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయిన స‌మ‌యంలో ఆండ్రీ ర‌సెల్ వ‌చ్చీ రావ‌డంతోనే విరుచుకు ప‌డ్డాడు.

ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. కేవలం 31 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న ర‌సెల్ 2 ఫోర్లు 8 సిక్స‌ర్ల‌తో 70 ప‌రుగులు చేశాడు. సామ్ బిల్లింగ్స్ కూడా 25 ప‌రుగులు చేసి కీల‌క పాత్ర పోషించారు.

మొత్తంగా మ్యాచ్ అనంత‌రం కేకేఆర్ ఓన‌ర్, బాలీవుడ్ దిగ్గ‌జం షారుఖ్ ఖాన్ ర‌స్సెల్ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ పై సంతోషం వ్య‌క్తం చేశాడు.

ఇదే స‌మ‌యంలో ఉమేష్ యాద‌వ్ బౌలింగ్ తీరు అద్భుతంగా ఉందంటూ ప్ఱ‌శంసించాడు కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్(Shreyas Iyer). ప్ర‌స్తుతం అయ్య‌ర్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఉమేష్ యాద‌వ్ తన వ‌య‌సు అయి పోతోందంటూ వాపోయ‌డ‌ని కానీ త‌న‌కంటే నువ్వే ఫిట్ గా ఉన్నావంటూ పేర్కొన్నాడు. ర‌సెల్ మార‌థాన్ ఇన్నింగ్స్ ఆడాడంటూ కొనియాడాడు.

Also Read : ర‌సెల్ దెబ్బ పంజాబ్ అబ్బా

Leave A Reply

Your Email Id will not be published!