Shubhman Gill : మరోసారి మెరిసిన శుభ్ మన్ గిల్
ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్
Shubhman Gill : ఐపీఎల్ 16వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న యంగ్ క్రికెటర్ శుభ్ మన్ గిల్(Shubhman Gill) నిలకడగా రాణిస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో కీలకమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంటున్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో గుజరాత్ వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది.
ఓ వైపు విజయ్ శంకర్ రెచ్చి పోయి ఆడితే శుభ్ మన్ గిల్ అందుకు భిన్నంగా ఆడాడు. 35 బంతులు ఎదుర్కొన్న గిల్ 49 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీని కోల్పోయాడు. మొత్తంగా ఈ సీజన్ లో అత్యధిక పరుగుల బ్యాటర్ల జాబితాలో తను కూడా చోటు దక్కించుకున్నాడు.
మొత్తంగా శుభ్ మన్ గిల్ పై బీసీసీఐ ఎక్కువగా ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. మరో వైపు సంజూ శాంసన్ ఫామ్ కోల్పోవడం కొంత ఇబ్బందికరంగా మారింది. కోల్ కతా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో గిల్ సక్సెస్ అయ్యాడు. విజయ్ శంకర్ , డేవిడ్ మిల్లర్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడి తమదైన ముద్ర కనబర్చారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు శుభ్ మన్ గిల్(Shubhman Gill).
ఇక విజయ్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పు కోవాలి. ఊహించని రీతిలో భారీ సిక్సర్లతో రెచ్చి పోయాడు. ఏకంగా 5 సిక్సర్లు కొట్టాడు. మొత్తంగా ఈ చెన్నై తంబి ఈసారి హాట్ టాపిక్ గా మారాడు.
Also Read : హెన్రిచ్ క్లాసెన్ సెన్సేషన్