Shubhman Gill : మెరిసిన శుభ్ మన్ గిల్
రాణించిన మోహిత్ శర్మ
Shubhman Gill : ఐపీఎల్ 16వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసింది కోల్ కతా నైట్ రైడర్స్. తాజాగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తో జరిగిన కీలక మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 154 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముందుగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ గుజరాత్ ముందుంచింది.
గుజరాత్ ఓపెనర్ శుభ్ మన్ గిల్(Shubhman Gill) అద్భుతంగా ఆడాడు. తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరో వైపు వృద్ది మాన్ సాహా కూడా 30 పరుగులతో మెరిశాడు. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. 19.5 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ టార్గెట్ ను పూర్తి చేసింది.
మొహాలీ లోని పీసీఏ స్టేడియంలో జరిగిన ఈ లీగ్ మ్యాచ్ లో ఆద్యంతమూ కళ్లు చెదిరే షాట్స్ తో అలరించారు బ్యాటర్లు. గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. చివరి ఓవర్ లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం.
ఇక శుభ్ మన్ గిల్ 49 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 1 సిక్సర్ తో 67 పరుగులు చేశాడు. పంజాబ్ తరపున మాథ్యూ షార్ట్ , షారుఖ్ ఖాన్ మాత్రమే పర్వాలేదని అనిపించారు. ఈసారి ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన పంజాబ్ స్కిప్పర్ శిఖర్ ధావన్ ఉన్నట్టుండి ఈ మ్యాచ్ లో తేలి పోయాడు.
Also Read : కావ్య కనిపిస్తే చాలు ఫ్యాన్స్ గగ్గోలు