Siddaramaiah Comment : సిద్దరామయ్య సింప్లిసిటీకి సలాం
సీఎంగా తనదైన ముద్ర ప్రారంభం
Siddaramaiah Comment : ఇవాళ ఎవరూ ఊహించని రీతిలో చర్చనీయాంశంగా మారారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య(Siddaramaiah). తన కెరీర్ లో ముఖ్యమంత్రి కావడం రెండోసారి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీని సాధించింది కాంగ్రెస్ పార్టీ. 224 సీట్లకు గాను 136 సీట్లు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ తరుణంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అపారమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా పేరు పొందారు సిద్దరామయ్య(Siddaramaiah). ఆయనను ఇప్పటికీ సోషలిస్ట్ గానే తెలిసిన వారు పరిగణిస్తారు. అలానే పిలుచుకునేందుకు ఆయన ఇష్ట పడతారు.
అత్యంత సాధారణ జీవితం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో నెగ్గుకు రావడం మామూలు విషయం కాదు. మరో వైపు ఎలాంటి సమయంలోనైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే తన పోటీదారు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ను సైతం విస్తు పోయేలా చేయడంలో సక్సెస్ అయ్యారు సిద్దరామయ్య. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని అనుకుంటారు. కొన్ని కేసులు, ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. కానీ ఎక్కడా తగ్గలేదు. ప్రధాని మోదీ తనను వ్యక్తిగతంగా తూలనాడినా నవ్వుతూ స్వీకరించారు.
రాజకీయంగా ప్రత్యర్థులైనా సరే సిద్దరామయ్యను ప్రేమిస్తారు. ఆపై ఆదరిస్తారు కూడా. ఆయన ఆహార్యం అచ్చం ఓ పల్లెటూరి రైతు లాగా ఉంటుంది. అలాగే ఉండడానికే ఎక్కువగా ఇష్ట పడతారు. ధోతీ, జుబ్బా, ఆపై టవాల్ ఇది ఆయన ఆహార్యం. కానీ ఎక్కడా అహం కానీ, గర్వం కానీ ఉండదు. ఇక మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సిద్దరామయ్య. బెంగళూరులోని కంఠీర స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంతకం చేశారు. ఆపై అశేష కన్నడ వాసులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం తాము ఇచ్చిన ఐదు హామీలను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
అంతే కాదు రాష్ట్రంలో అన్నార్థులు, విద్యార్థులు, వృద్దులు, పేదలు, సామాన్యులు, నిరుద్యోగులు, ఒంటరి తల్లుల ఆకలి తీర్చేందుకు ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించాచరు సిద్దరామయ్య. తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. తాను సీఎం అయినా సామాన్యుడినేనని , ట్రాఫిక్ లో ఎవరికీ ఇబ్బందులు కలిగించవద్దంటూ కోరారు. ఈ మేరకు ట్రాఫిక్ చీఫ్ ను ఆదేశించారు. ప్రస్తుతం సిద్దరామయ్య చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. అందుకే క్లీన్ ఇమేజ్ కలిగిన సిద్దరామయ్యను తమ నాయకుడంటూ కీర్తిస్తున్నారు కన్నడ జనం. జీవిత కాలం మెరుగైన ప్రజా పాలన సాగించాలని కోరుకుందాం.
Also Read : KTR Focus
