Siddaramaiah : షెట్టర్ చేరికతో కాంగ్రెస్ లో జోష్
నిజాయితీ కలిగిన నాయకుడు
Siddaramaiah : భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మరింత బలాన్ని ఇస్తుందని అన్నారు మాజీ సీఎం సిద్దరామయ్య(Siddaramaiah). సోమవారం ఆయన మాట్లాడారు. ఆయన రాకతో తమ పార్టీకి మరింత ఊపు తెచ్చిందన్నారు. బీజేపీలో ఆయనకు తీరని అవమానం జరిగిందని ఇది తనను బాధ కలిగించదన్నారు సిద్దరామయ్య. ఈసారి జరగబోయే ఎన్నికల్లో 150 సీట్లకు పైగా గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
జగదీశ్ షెట్టర్ మంచి నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన భావజాలానికి కట్టుబడి ఉన్నారు. మొదటి నుంచి ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. ఏరోజూ కూడా వ్యక్తిగతంగా కానీ ఎప్పుడూ నోరు జారలేదన్నారు. అత్యంత నిబద్దత కలిగిన రాజకీయ వేత్త అని కొనియడారు జగదీశ్ షెట్టర్ ను.
ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తి అయినప్పటికీ సెక్యులర్ శక్తిగా ఉన్నారని కితాబు ఇచ్చారు మాజీ సీఎం. వ్యక్తిగత ప్రయోజానాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని నమ్మిన నాయకుడు అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సోమవారం ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ , కేసీ వేణుగోపాల్ , మాజీ సీఎం సిద్దరామయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ సీఎం జగదీశ్ షెట్టర్.