Sikindar Raza : వారెవ్వా సికిందర్ రజా
భారత్ కు చుక్కలు చూపించాడు
Sikindar Raza : జింబాబ్వే టూర్ లో భారత్ కు చుక్కలు చూపించాడు ఆతిథ్య జట్టు జింబాబ్వే తరపున ఆడిన సికిందర్ రజా. ఇతడి పూర్తి పేరు సికిందర్ రజా బట్. తన జట్టును గెలుపు అంచుల దాకా తీసుకు వచ్చాడు.
ఒక రకంగా బెంబేలు పుట్టించాడు. అతడి వయస్సు 36 ఏళ్లు. పాకిస్తాన్ లోని పంజాబ్ సియోల్ కోట్ లో 24 ఏప్రిల్ 1986లో పుట్టాడు. కుడి చేతి బ్యాటర్.
2013 నుండి జింబాబ్వే తరపున ఆడుతున్నాడు.
వన్డే మ్యాచ్ ను 3 మే 2013లో బంగ్లాదేశ్ తో స్టార్ట్ చేశాడు. టి20 మ్యాచ్ ను 11 మే 2013లో ఇదే బంగ్లాతో ప్రారంభించాడు. ఒక్కసారి సికిందర్ రజా
మైదానంలో కుదురుకున్నాడంటే ఇక పరుగుల వరద పారాల్సిందే.
2010 నుండి 2020 దాకా సదరన్ రాక్స్ తో ఆడాడు. 2018లో మాంట్రియల్ టైగర్స్ , 2019లో కరాచీ కింగ్స్ , 2020లో పెషావర్ జల్మీ, ట్రిన్ బాగో నైట్
రైడర్స్ , 2021 బిరత్ నగర్ వారియర్స్ తదితర లీగ్స్ తరపున ఆడాడు సికిందర్ రజా(Sikindar Raza).
17 వన్డే మ్యాచ్ లు ఆడాడు 1,187 రన్స్ చేశాడు. 50 టి20 లు ఆడాడు. 3,366 రన్స్ చేశాడు. తన కుటుంబంతో జింబాబ్వేకు వలస వెళ్లాడు. సికిందర్ రజా
ప్రధాన కల వైమానిక దళంలో చేరాలని. కానీ ఆ కల నెరవేర లేదు.
దీంతో క్రికెట్ ను తన కెరీర్ గా ఎంచుకున్నాడు. రజా టి20 స్పెషలిస్ట్ బ్యాటర్ గా పేరొందాడు. తాజాగా హరారే వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో
భారత్ కు వ్యతిరేకంగా 115 రన్స్ తో అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు.
భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎవరీ సికిందర్ రజా(Sikindar Raza) అనేలా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.
Also Read : ఉత్కంఠ భరిత పోరులో భారత్ హవా