Kangana Ranaut : నిశ్శ‌బ్దం ఎప్పుడూ శాంతిని ఇవ్వ‌దు

న‌వాజుద్దీన్ సిద్దిఖీపై కంగ‌నా ర‌నౌత్

Kangana Ranaut Nawazuddin  : వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు పేరొందిన బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్(Kangana Ranaut) మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మాజీ భార్య‌తో వైరంపై న‌వాజుద్దీన్ మౌనం వీడ‌డంపై స్పందించింది. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. నిశ్శ‌బ్దం ఎప్పుడూ శాంతిని ఇవ్వ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. తోటి న‌టుడు న‌వాజుద్దీన్ సిద్దిఖీ త‌న భార్య ఆలియా సిద్దిఖీ నుంచి విడిపోయాడు. ఈ సంద‌ర్భంగా అగ్ర న‌టుడికి మ‌ద్ద‌తు ప‌లికారు.

సోమ‌వారం త‌న ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో కంగ‌నా ర‌నౌత్ రాశారు. న‌వాజుద్దీన్ సిద్దిఖీ సాబ్ చాలా అవ‌స‌రం..మౌనం మాకు ఎప్పుడూ శాంతిని ఇవ్వ‌దు. మీరు ఈ ప్ర‌క‌ట‌న జారీ చేసినందుకు నేను సంతోషిస్తున్నాన‌ని పేర్కొంది. మీ క‌థ లోని మీ వైపు తెలుసు కోవాల‌నే ఆస‌క్తి ఉన్న మీ ఫ్యాన్స్ , శ్రేయోభిలాషులు చాలా మంది ఉన్నార‌ని తెలిపారు కంగ‌నా ర‌నౌత్(Kangana Ranaut Nawazuddin).

ఈ సంద‌ర్భంగా న‌వాజుద్దీన్ సిద్దిఖీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. నా మౌనం కార‌ణంగా నేను ప్ర‌తి చోటా చెడ్డ వాడిగా పిలువ‌బ‌డ్డాను. నేను నిశ్శ‌బ్దంగా ఉండేందుకు కార‌ణం ఈ త‌మాషా గా మారింద‌ని పేర్కొన్నాడు.

ఇదంతా ఎక్క‌డో నా చిన్న పిల్ల‌లు చ‌దువుతారు..సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫార‌మ్ లు , మీడియా అంతా ఏక‌ప‌క్షంగా మ‌ద్ద‌తు ప‌లుకుతోందంటూ ఆరోపించారు. మేం ఇప్ప‌టికే విడాకులు తీసుకున్నామ‌ని తెలిపారు.

ఆలియా సిద్దిఖీకి డ‌బ్బులు ఎక్కువ కావాలి. అందుకే నాపై , మా అమ్మ‌పై కేసులు పెట్టార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు నవాజుద్దీన్ సిద్దిఖీ.

Also Read : ర‌త్నానీ క్లిక్ ఐష్ అందం ఫ్లాష్

Leave A Reply

Your Email Id will not be published!