Simhachalam: ఈ నెల 30 సింహాచలం అప్పన్న స్వామి నిజరూపదర్శనం !
ఈ నెల 30 సింహాచలం అప్పన్న స్వామి నిజరూపదర్శనం !
Simhachalam : సింహాచలం క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నరశింహాస్వామి వారి నిజరూప దర్శనం, చందనోత్సవానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో సింహగిరిపై అప్పన్నస్వామి నిజరూపదర్శనానికి టికెట్ల విక్రయాలు గురువారం (ఏప్రిల్ 24 నుంచి) నుంచి ప్రారంభమవుతాయని దేవస్థానం ఈవో కె. సుబ్బారావు వెల్లడించారు. దేవస్థానం నిర్దేశించిన ప్రాంతాలతో పాటు ఆన్ లైన్ లో ఈ నెల 29వ తేదీ వరకు రూ.300, రూ.1000 టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు. 29వ తేదీ తర్వాత ఎలాంటి విక్రయాలు జరగవని స్పష్టం చేశారు. చందనోత్సవం రోజు కూడా టికెట్లు విక్రయం జరగదన్నారు. భక్తుల కోసం ఉచిత దర్శనాల క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. కాబట్టి భక్తులు గమనించి… నిజరూప దర్శనం టిక్కెట్లు ఆయా కౌంటర్లలో లేదా ఆన్ లైన్ ద్వారా తీసుకోవాలని సూచించారు.
Simhachalam – నిజరూప దర్శనం టికెట్లు లభించే ప్రాంతాలివే
సింహగిరిపై పాత పీఆర్వో కార్యాలయం వద్ద ఉదయం 7గంటల నుంచి రాత్రి 7గంటల వరకు.
సింహాచలంలోని(Simhachalam) యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు శాఖల్లో ఉదయం 9గంటల నుంచి రాత్రి 7గంటల వరకు. అక్కయ్యపాలెం, మహారాణిపేట యూనియన్ బ్యాంకు శాఖల్లో
బిర్లా కూడలి, సాలిగ్రామపురంలోని స్టేట్ బ్యాంక్ శాఖల్లో పనివేళల్లో టికెట్లు తీసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో www.aptemples.ap.gov.in ద్వారా ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం 6గంటల వరకు టికెట్లు పొందొచ్చు.
Also Read : AP SSC Results: ఏపీ టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదల