Simon Katich : సన్ రైజర్స్ హైదరాబాద్ కు కోలుకోలేని షాక్ తగిలింది. త్వరలోనే ఐపీఎల్ రిచ్ లీగ్ స్టార్ట్ కానుంది. ఈ తరుణంలో ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్(Simon Katich) తప్పుకుంటున్నట్లు ప్రచారం.
ఇటీవల మెగా వేలం పాట బెంగళూరులో జరిగింది. ఇందులో తన అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదని ఆగ్రహంతో ఉన్నట్లు టాక్. ప్రధానంగా అన్నీ తానై వ్యవహరించారు ఆ జట్టు ఫ్రాంచైజీ సిఇఓ కావ్య మారన్.
ఇప్పటికే ఐపీఎల్ లో అత్యంత పేలవమైన ప్రదర్శనతో చాలా మందిని మార్పు చేసింది. ప్రధానంగా టాప్ ప్లేయర్ గా ఉన్న డేవిడ్ వార్నర్ ను వదులుకుంది. అత్యంత అవమానకర రీతిలో పంపించేసింది.
అప్పట్లో ఆ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఎక్కడా ఆ మేనేజ్ మెంట్ గురించి చెడుగా మాట్లాడలేదు వార్నర్. అతడిని మెగా వేలంలో ఊహించని రీతిలో రూ. 6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
ఇదిలా ఉండగా వేలం పాటలో ఫ్రాంచైజీ అనుసరించిన పద్దతులు, వ్యూహాలు నచ్చకనే కటిచ్ కటీఫ్ చెప్పాలని నిర్ణయించుకున్నట్లు జోరుగా టాక్ . కటిచ్(Simon Katich) తప్పుకుంటున్న విషయాన్ని ది ఆస్ట్రేలియన్ ప్రస్తావించింది ప్రత్యేకంగా.
లారాను బ్యాటింగ్ కోచ్ గా నియమించింది. కటిచ్ ను అసిస్టెంట్ కోచ్ గా , హెడ్ కోచ్ గా టామ్ మూడీ, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా స్టెయిన్ , స్పిన్ కోసం మురళీధరన్ ను, ఫీల్డింగ్ కోచ్ గా బదానినీ నియమించింది.
ఇప్పటికే కావ్య మారన్ ఒంటెత్తు పోకడ, యాజమాన్యం అనుసరిస్తున్న తీరుపై క్రీడాభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.
Also Read : తడబడినా దుమ్ము రేపాడు