Changi Airport : చాంగి ఎయిర్‌పోర్ట్ ప్రపంచంలో టాప్
మరోసారి నెంబర్ వన్ గా నిలిచిన చాంగి
Changi Airport : సింగపూర్ లోని చాంగి ఎయిర్ పోర్ట్ మరోసారి ప్రపంచంలోనే టాప్ లో నిలిచింది. అత్యుత్తమ ఎయిర్ పోర్టులు 20ని ప్రకటించింది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్ పోర్ట్ అవార్డ్స్ 2023లో ఆసియా హబ్ దోహా లోని హద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను రెండో స్థానానికి చేర్చింది. టోక్యో లోని హనేడా ఎయిర్ పోర్టు మూడో స్థానంతో సరి పెట్టుకుంది. చాంగి ఎయిర్ పోర్ట్(Changi Airport) ఉత్తమ ఎయిర్ పోర్ట్ గా ఎంపిక కావడం వరుసగా ఇది రెండోసారి కావడం విశేషం.
కరోనా మహమ్మారి ప్రయాణ పరిమితుల సమయంలో రెండేళ్ల పాటు కతార్ కు దీర్ఘ కాలంగా ఉన్న కిరీటాన్ని కోల్పోయిన చాంగి తిరిగి మరోసారి సత్తా చాటింది. విచిత్రం ఏమిటంటే టాప్ 10 ఎయిర్ పోర్ట్ లలో యుఎస్ కు చెందిన ఏ ఒక్క ఎయిర్ పోర్టు లేక పోవడం గమనార్హం. పారిస్ లోని చార్లెస్ డిగల్లె ఐదో స్థానంలో నిలిచింది. సీటెల్ టాకోమా ఎయిర్ పోర్ట్ 18వ స్థానం దక్కించుకుంది. వరుసగా విమానాశ్రయాలను చూస్తే ఇలా ఉన్నాయి.
సింగపూర్ చాంగి , దోహా హమద్ , టోక్యో హనెడా , సియోల్ ఇంచియాన్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. పారిస్ చార్లెస్ డి గాలె , ఇస్తాంబుల్ , మ్యూనిచ్ , జ్యూరిచ్ , టోక్యో నరిటా , మాడ్రిడ్ బరాజస్ , వియన్నా విమానాశ్రాయలు ఉన్నాయి.
హెల్సింకి వాంటా , రోమ్ ఫియుమిసినో , కోపెన్ హాగన్ , కన్సాయ్ , సెంట్రైర్ నగోయా , దుబాయ్ , సీటెల్ టాకోమా , మెల్బోర్న్ , వాంకోవర్ ఎయిర్ పోర్టులు చోటు దక్కించుకున్నాయి. ప్రతి ఏడాది అత్యుత్తమ ఎయిర్ పోర్టులను ఎంపిక చేస్తూ ఉండడం ఆనవాయితీగా వస్తోంది.
Also Read : ధన్య రాజేంద్రన్ కు పురస్కారం