Dhanya Rajendran : ధ‌న్య రాజేంద్ర‌న్ కు పుర‌స్కారం

చ‌మేలీ దేవి జైన్ అవార్డుకు ఎంపిక

Dhanya Rajendran : ది న్యూస్ మినిట్ (టీఎన్ఎం) ఎడిట‌ర్ ఇన్ చీఫ్ ధ‌న్య రాజేంద్ర‌న్ కు అరుదైన పుర‌స్కారం ద‌క్కింది. ఆమెకు 2022 సంవ‌త్స‌రానికి గాను చ‌మేలీ దేవి జైన్ అవార్డుకు ఎంపిక‌య్యారు. ఈ మేర‌కు జైన్ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న‌చేసింది. మంచి జ‌ర్న‌లిజ‌జం ప్ర‌జాస్వామ్యాన్ని ఎలా ప్ర‌భావితం చేస్తుందో చెప్పేందుకు ధ‌న్య రాజేంద్ర‌న్ ఒక అద్భుత‌మైన ఉదాహ‌ర‌ణ అని మీడియా ఫౌండేష‌న్ చైర్మ‌న్ హ‌రీష్ ఖ‌రే స్ప‌ష్టం చేశారు.

ధ‌న్య రాజేంద్ర‌న్ ది న్యూస్ మినిట్ కో ఫౌండ‌ర్ గా ఉన్నారు. అంతే కాకుండా ఎడిట‌ర్ ఇన్ చీఫ్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అవార్డ్ ఎంపిక‌కు సంబంధించి కాల‌మిస్ట్ ల‌తో కూడిన ముగ్గురు స‌భ్యుల జ్యూరీ ది ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ లో నేష‌న‌ల్ రూర‌ల్ అఫైర్స్ అండ్ అగ్రిక‌ల్చ‌ర్ ఎడిట‌ర్ హ‌రీష్ దామోద‌ర‌న్ , పీటీఐ భాషా ఎడిట‌ర్ నిర్మ‌ల్ పాఠ‌క్ , నిధి రాజ్దాన్ ఉన్నారు. ధ‌న్య రాజేంద్ర‌న్ వ్య‌క్తిగ‌త యోగ్య‌త‌ను మాత్ర‌మే కాకుండా నిబ‌ద్ద‌త‌తో కూడిన జ‌ర్న‌లిజాన్ని ప్ర‌తిబింబించేలా ప‌ని చేశారంటూ కితాబు ఇచ్చారు.

1982లో చ‌మేలీదేవి జైన్ ఫౌండేష‌న్ ను స్థాపించారు. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన వార్షిక అవార్డును మీడియా ఫౌండేష‌న్ నిర్వ‌హిస్తుంది. సామాజిక అభివృద్ది, రాజ‌కీయాలు, ఈక్విటీ , లింగ న్యాయం, ఆరోగ్యం, యుద్దం, సంఘ‌ర్ష‌ణ‌, వినియోగ‌దారు వంటి ఇతివృత్తాల‌పై రిపోర్టింగ్ తో ప్ర‌భావం చూపిన దేశంలోని మ‌హిళా మీడియా ప్ర‌తినిధుల‌ను గుర్తిస్తుంది. ఈసారి ధ‌న్య రాజేంద్ర‌న్ కు(Dhanya Rajendran) ద‌క్క‌డం విశేషం.

ఈ ఏడాది మీడియా ఫౌండేష‌న్ దేశం న‌లుమూల‌ల నుంచి 70కి పైగా ఎంట్రీల‌ను అందుకుంది. మార్చి 21న ఢిల్లీలోని ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ సెంట‌ర్ లో ఈ పుర‌స్కారాన్ని అంద‌జేయ‌నున్నారు.

Also Read : సివిక్ స్టూడియోస్ మాస్ వాయిస్

Leave A Reply

Your Email Id will not be published!