David Warner DC : ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ గా డేవిడ్ వార్న‌ర్

గాయం దెబ్బ‌కు స్కిప్ప‌ర్ రిషబ్ పంత్ దూరం

David Warner DC : ఈ ఏడాది జ‌రిగే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో కీల‌క మార్పు చోటు చేసుకుంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు స్కిప్ప‌ర్ గా ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్(David Warner DC) ఎంపిక‌య్యాడు. ఈ విష‌యంపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది ఢిల్లీ క్యాపిట‌ల్స్ యామాన్యం. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ లో అధికారికంగా వెల్ల‌డించింది. వార్న‌ర్ స్థానంలో గ‌తంలో రిష‌బ్ పంత్ కెప్టెన్ గా ఉన్నారు. ఇటీవ‌ల పంత్ త‌న స్వంత ఊరికి వెళుతుండ‌గా రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యారు. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు స‌న్ రైజ‌ర్స్ హ‌ద‌రాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు వార్న‌ర్. గ‌త ఏడాది ఢిల్లీ క్యాపిట‌ల్స్ డేవిడ్ వార్న‌ర్ ను వేలం పాట‌లో చేజిక్కించుకుంది. ఈ త‌రుణంలో అపార‌మైన అనుభ‌వంతో పాటు ఐపీఎల్ లో స‌త్తా చాటిన స్టార్ క్రికెట‌ర్ వైపే ఢిల్లీ క్యాపిట‌ల్స్ యాజ‌మాన్యం మొగ్గు చూపింది. ఆయ‌న‌కే సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

ఇదిలా ఉండ‌గా డేవిడ్ వార్న‌ర్ త‌న ఐపీఎల్ ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ నుంచే ప్రారంభించ‌డం విశేషం. ఆ త‌ర్వాత స‌న్ రైజ‌ర్స్ కు మారాడు. అక్క‌డి నుంచి మ‌ళ్లీ ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు వ‌చ్చాడు. కాగా 2016లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ను ఐపీఎల్ విజేత‌గా నిలిపిన ఘ‌న‌త డేవిడ్ వార్న‌ర్(David Warner).

కాగా త‌న‌కు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించినందుకు సంతోషం వ్య‌క్తం చేశారు స్టార్ క్రికెట‌ర్. ఒక ర‌కంగా రిష‌బ్ పంత్ ను మిస్ కావ‌డం బాధ‌గా ఉంద‌న్నారు.

Also Read : టెస్టు ర్యాంకింగ్స్ లో అశ్విన్ టాప్

Leave A Reply

Your Email Id will not be published!