Singareni Union Election : సింగరేణిలో దుద్దిళ్ల ప్రచారం
కార్మిక సంఘాల ఎన్నికలు షురూ
Singareni : సింగరేణి – దేశంలోనే పేరు పొందిన సింగరేణి(Singareni) కాలరీస్ లో ప్రస్తుతం కార్మిక సంఘాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
Singareni Union Election Campaign Viral
మంథని ఎమ్మెల్యే, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్న కార్మిక సంఘం ఐఎన్టీయూసీ బరిలో ఉంది. తమ యూనియన్ ను గెలిపించాలని కోరుతున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఐటీ మంత్రి.
ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ప్రధాన పార్టీలు. బీజేపీ , బీఆర్ఎస్ , కాంగ్రెస్, వామపక్షాల తరపున కార్మిక సంఘాలు బరిలో నిలవనున్నాయి. ఇప్పటికే సింగరేణి కాలరీస్ లో పని చేస్తున్న కార్మికులు ఎటు వైపు మొగ్గు చూపుతారనే దానిపై దృష్టి సారించాయి పార్టీలు.
ఇదిలా ఉండగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని మైనింగ్ ప్రాంతాల్లో ఇండియనేషన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టారు. ఎలాగైనా సరే గెలుపొందాలని ప్రయత్నం చేస్తున్నారు.
Also Read : JD Laxminarayana : వంగవీటి రంగాకు జేడీ నివాళి