Nara Lokesh : ఆర్జీవీ వ్యూహంపై లోకేష్ పిటిష‌న్

ఈనెల 29న విడుద‌ల కానున్న మూవీ

Nara Lokesh : హైద‌రాబాద్ – ప్ర‌ముఖ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తీసిన వ్యూహం చిత్రంపై వివాదాలు రాజుకున్నాయి. ఈ మూవీపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ వ‌చ్చారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్(Nara Lokesh) . ఈ మేర‌కు తాజాగా తెలంగాణ హైకోర్టులో వ్యూహం చిత్రం విడుద‌ల నిలుపుదల చేయాల‌ని కోరుతూ దావా దాఖ‌లు చేశారు.

Nara Lokesh Comments on RGV

ఇంత‌కు ముందు కూడా అభ్యంత‌రం తెలిపినా ప‌ట్టించు కోలేదు డైరెక్ట‌ర్ ఆర్జీవీ. ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు . ఈనెల 29న రిలీజ్ కావాల్సి ఉంది. ఈ వ్యూహం చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లలో నారా చంద్ర‌బాబు నాయుడు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ల‌ను వాడ‌డంపై మండిప‌డ్డారు నారా లోకేష్.

అయితే వ్యూహం చిత్రానికి సంబంధించి సెన్సార్ బోర్డు కొన్ని అభ్యంత‌రాల‌ను వ్య‌క్తం చేస్తూ సినిమా విడుద‌ల‌కు ఓకే చెప్పింది. దీనికి యూఏ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. అయితే వ్య‌క్తుల‌ను టార్గెట్ చేస్తూ ఇలాంటి సినిమాలు తీయ‌డం స‌మాజానికి మంచి ప‌ద్ద‌తి కాద‌ని సెన్సార్ బోర్డు అభిప్రాయ ప‌డింది.

కాగా వ్యూహం చిత్రానికి ఎలా స‌ర్టిఫికెట్ ఇస్తారంటూ ప్ర‌శ్నించారు టీడీపీ నేత నారా లోకేష్. ఇదిలా ఉండ‌గా లోకేష్ అభ్యంత‌రం వ్య‌క్తం చేయడాన్ని తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.

Also Read : Singareni Union Election : సింగ‌రేణిలో దుద్దిళ్ల ప్ర‌చారం

Leave A Reply

Your Email Id will not be published!