Singer KK : దిగ్గజ గాయకుడు కేకే ఇక లేరు
మూగ బోయిన స్వరం..తీరని విషాదం
Singer KK : భారతీయ సినీ ప్రపంచంలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణం చెందారు. కోల్ కతా లోని నజ్రుల్ మంచా ఆడిటోరియంలో సంగీత కచేరి నిర్వహించారు.
అనంతరం తను బస చేసిన హొటలల్ లో కుప్ప కూలి పోయాడు. కేకే వయసు 53 ఏళ్లు. ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు సీఎంఆర్ఐ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.
సంగీత కచేరి చేపట్టిన కొన్ని గంటలకే సోషల్ మీడియాలో కేకే పాడిన పాటలు వైరల్ గా మారాయి. అంత లోనే ఆయన ఈ లోకాన్ని వీడడంతో ఒక్కసారిగా సినీ సంగీత ప్రపంచం విస్తు పోయింది.
కేకే(Singer KK) అనేది ముద్దు పేరు. ఆయన పూర్తి పేరు కృష్ణ కుమార్ కున్నాత్. పాల్, యారోన్ వంటి పాటలు కేకేకు మంచి గుర్తింపు తీసుకు వచ్చాయి.
1990 చివరలో కేకే పాడిన సాంగ్స్ హిట్ గా నిలిచాయి. పాఠశాల, కాలేజీ వీడ్కోలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ఆయన పాడిన పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.
ఒకానొక సమయంలో కళాకారుడి గురించి గొప్పగా చెప్పాడు కేకే(Singer KK). కళాకారుడు స్టేజిపై ఉన్నప్పుడు ఒక నిర్దిష్ట శక్తి పొందుతాడు. ఆనందానికి లోనవుతాడు.
తాను వేదికపైకి వచ్చాక అన్నీ మరిచి పోతాను. సాధ్యమైనంత వరకు వంద శాతం రిజల్ట్ ఇచ్చేందుకు తాపత్రయ పడతాను అని ఒకానొక సందర్భంలో పేర్కొన్నాడు.
1999లో తొలి ఆల్బం పాల్ విమర్శకుల ప్రశంసలు పొందింది. 2000ల ప్రారంభం నుండి కేకే ప్లేబ్యాక్ సింగింగ్ లో కెరీర్ స్టార్ట్ చేశాడు. బాలీవుడ్ చిత్రాల కోసం అద్భుతమైన పాటలు పాడాడు.
Also Read : కేకే హఠాన్మరణం బాధాకరం – మోదీ