KK Funeral : ఇక సెలవంటూ వెళ్లి పోయిన కేకే
అశేష జనవాహిని మధ్య అంత్యక్రియలు
KK Funeral : కోల్ కతాలో సంగీత కచేరి చేసిన అనంతరం హఠాన్మరణం చెందిన ప్రముఖ గాయకుడు కేకే(KK Funeral) అంత్యక్రియలు గురువారం ముంబైలో పూర్తయ్యాయి.
కుటుంబీకులు, స్నేహితులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, గాయనీ గాయకులు ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. నగరంలోని వెర్సోవా హిందూ శ్మశాన వాటికలో కేకే దహన సంస్కారాలు పూర్తయ్యాయి.
దారి పొడవునా ఆయనకు నివాళులు అర్పించారు. భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. కేకే పూర్తి పేరు కృష్ణకుమార్ కున్నాత్. రంగస్థలంలోకి వచ్చాక కేకే అని ముద్దుగా పిలుచుకుంటారు.
హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, అస్సామీ , తదితర భాషల్లో పలు పాటలు పాడాడు. భారతీయ సినీ సంగీతంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు కేకే.
అంతే కాదు జింగిల్స్ పాడడంలో ఆయన టాప్ లో ఉన్నాడు. ఏకంగా 3,500 మందికి పైగా పాడాడు. అతడినిలోని ప్రతిభను గుర్తించిన దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చాన్స్ ఇచ్చాడు.
ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. కేకేకు తెలుగు సినిమాతో ఎనలేని బంధం ఉంది. ఎన్నో విజయవంతమైన పాటలు పాడాడు. కిలోమీటర్
పొడవునా కేకే(KK Funeral) అంతిమయాత్ర కొనసాగింది.
ఆయన మరణంతో ఒక్కసారిగా దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఈ ఆఖరి యాత్రలో సినీ నిర్మాత, స్నేహితుడు విశాల్ భరద్వాజ్ , భార్య రేఖ,
చిత్ర నిర్మాత అశోక్ పండిట్ , రచయిత జావేద్ అక్తర్, గాయకుడు శంకర్ మహదేవన్ హాజరయ్యారు.
ఉదిత్ నారాయణ్, అబిజిత్ భట్టాచార్య, శ్రేయా ఘోషల్ , సలీం మర్చంట్ , అల్కా యాగ్నిక్ , రాహుల్ వైద్య, జావేద్ అలీ, పాపోన్ , శంతను
మోయిత్రా , సుదేశ్ బోసలే , తదితరులు తరలి వచ్చారు.
ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేకే కు గౌరవార్థం గన్ సెల్యూట్ చేసింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన చిత్ర పటానికి
పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Also Read : నిజం నిలిచింది న్యాయం గెలిచింది