Siraj Samson : గెలుపులో సిరాజ్..శాంస‌న్ హీరోలు

ఆఖ‌రి ఓవ‌ర్ లో తిప్పేసిన బౌల‌ర్

Siraj Samson : వ‌న్డే సీరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో జ‌రిగిన మొద‌టి వ‌న్డే మ్యాచ్ లో ఉత్కంఠ పోరు కొన‌సాగింది. చివ‌రి బంతి వ‌ర‌కు టెన్ష‌న్ నెల‌కొంది. కానీ ఆఖ‌రి ఓవ‌ర్ లో 15 ప‌రుగులు కావాల్సి వ‌చ్చింది.

ఒక ర‌కంగా చూస్తే విండీస్ అద్భుత‌మైన ఫామ్ లో ఉంది. భార‌త జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 308 ప‌రుగులు చేసింది. భారీ టార్గెట్ విండీస్ ముందుంచింది.

కానీ విండీస్ బ్యాట‌ర్లు చివ‌రి దాకా పోరాడారు. వ‌న్డే జ‌ట్టు కెప్టెన్ వెట‌ర‌న్ ప్లేయ‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ ఆఖ‌రి ఓవ‌ర్ ను మ‌హ్మ‌ద్ సిరాజ్(Mohammed Siraj) కు ఇచ్చాడు. స్టేడియం అంతా ఉత్కంఠ‌తో ఎదురు చూస్తోంది.

ఈ త‌రుణంలో ఒక వేళ బంతిని గ‌నుక వ‌దిలి వేస్తే విండీస్ గెలిచి ఉండేది. అప్ప‌టికే 305 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. దీంతో 3 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది టీమిండియా.

ప్ర‌ధానంగా అద్భుత‌మైన బౌలింగ్ తో మ‌హ్మ‌ద్ సిరాజ్ ఆక‌ట్టుకోగా బంతుల్ని ప‌రుగులు చేయ‌నీయ‌కుండా అడ్డుకున్నాడు వికెట్ కీప‌ర్ గా ఉన్న సంజూ శాంస‌న్(Sanju Samson). దీంతో ఆ ఇద్ద‌రూ ఇప్పుడు భార‌త్ గెలుపులో కీల‌క పాత్ర పోషించారు.

వారే నిజ‌మైన హీరోలుగా మారారు. ఆఖ‌రి ఓవ‌ర్ కి సంబంధించి బీసీసీఐ(BCCI) త‌న అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ లో వీడియోను పోస్ట్ చేసింది. ఓ వైపు కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ 97 ప‌రుగులు చేసి రెచ్చి పోతే శుభ్ మ‌న్ గిల్ , అయ్యర్ లు అద‌రగొట్టారు.

మొత్తంగా బౌలింగ్ తో తిప్పేసిన సిరాజ్ , బంతి ఫోర్ పోకుండా అడ్డుకున్న శాంస‌న్ సంబురాల్లో మునిగి పోయారు.

Also Read : ర‌స‌వ‌త్త‌ర పోరులో భార‌త్ దే విజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!