Siricilla Rajaiah: రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య !
రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య !
Siricilla Rajaiah: మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ గా నియమిస్తూ తెలంగాణా గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీచేశారు. రాజయ్యతో పాటు వికారాబాద్ కు చెందిన ఎం.రమేశ్, సూర్యాపేట జిల్లాకు చెందిన సంకేపల్లి సుధీర్‌రెడ్డి, మహబూబాబాద్ జిల్లాకు చెందిన నెహ్రూ నాయక్ మాలోత్ ను ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా నియమించారు. వీరు రెండేళ్ల పాటు ఈ పదవుల్లో ఉంటారు. రాజయ్య(Siricilla Rajaiah) గతంలో వరంగల్ ఎంపీగా పనిచేయగా… వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించడం చర్చనీయాంశంగా మారింది.
Siricilla Rajaiah – వక్ఫ్ బోర్డు చైర్మెన్ గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ !
తెలంగాణా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మెన్ గా సీనియర్ కాంగ్రెస్ నాయకులు సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ ను నియమితులయ్యారు. ఈ మేరకు తన కార్యాలయంలో సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మల్లేపల్లికి చెందిన అజ్మతుల్లా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ గా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Also Read : Minister Jupally : ఆత్మగౌరవం ఉంటే హరీష్ రావు తన పదవికి రాజీనామా చేయాలి