Lok Sabha Sessions: లోక్‌ సభ ముందుకు ఆరు బిల్లులు !

లోక్‌ సభ ముందుకు ఆరు బిల్లులు !

Lok Sabha Sessions: ఈ నెల 23 నుంచి ఆగస్టు 12 వరకు జరుగనున్న పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరిగే సమయంలో ఆరు బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు గురువారం లోక్‌ సభ(Lok Sabha) సచివాలయం విడుదల చేసిన బులిటెన్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ 2024-25 బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత సభ ముందుకు ఫైనాన్స్‌ బిల్లు-2024ను తీసుకొస్తారు. అనంతరం సభా కార్యకలాపాలు వాయిదా పడతాయి.

Lok Sabha Sessions….

ఆ రోజు ప్రశ్నోత్తరాలు కానీ, జీరో అవర్‌ కానీ ఉండదు. మరుసటి రోజు నుంచి సభ ముందుకు ‘విపత్తు నిర్వహణ సవరణ బిల్లు’, ‘బాయిలర్స్‌ బిల్లు’, ఎయిర్‌క్రాఫ్ట్‌ చట్టం-1934లో ఉన్న అసందిగ్ధతలను తొలగించి మరింత స్పష్టత ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌-2024 బిల్లు’, భారతీయ కాఫీ, రబ్బర్‌ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘కాఫీ (ప్రమోషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌)బిల్లు-2024’, ‘రబ్బర్‌ (ప్రమోషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌)బిల్లు-2024’ను సభముందుంచి ఆమోదించనున్నారు. ప్రభుత్వం విషయ ప్రాధాన్యాన్ని బట్టి మరికొన్ని బిల్లులనూ సభ ముందుకు తెచ్చే అవకాశం ఉంటుంది.

వివిధ శాఖలకు సంబంధించిన డిమాండ్స్, గ్రాంట్స్‌పై చర్చించి అందుకు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోద ముద్ర వేయనున్నారు. 2024-25 జమ్మూకశ్మీర్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. పార్లమెంటు సభ్యులు అత్యవసర ప్రజాప్రయోజన అంశాలను సభలో ప్రస్తావించడానికి ఆన్‌లైన్‌ ద్వారా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన వాటిల్లోంచి ప్రతిరోజూ లాటరీ ద్వారా 20 మంది సభ్యులను ఎంపిక చేసి జీరో అవర్‌లో మాట్లాడటానికి అవకాశం కల్పిస్తారు. అయితే విషయ అత్యవసరతను బట్టి స్పీకర్‌ అనుమతిచ్చిన వారు కూడా మాట్లాడేందుకు వీలుంటుంది.

Also Read : Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు దోషులకు సుప్రీం కోర్టు షాక్ !

Leave A Reply

Your Email Id will not be published!