Mamata Banerjee D Lit : మ‌మ‌తా బెన‌ర్జీకి గౌర‌వ డాక్ట‌రేట్

సెయింట్ జేవియ‌ర్స్ యూనివ‌ర్శిటీ వెల్ల‌డి

Mamata Banerjee D Lit : ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రిగా రికార్డు స్థాయిలో పాల‌న సాగిస్తూ వ‌స్తున్నారు. ఆమె తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీని కింది స్థాయి నుంచి పై స్థాయి వ‌ర‌కు బ‌లోపేతం చేసింది. ఇదే స‌మ‌యంలో మ‌మ‌తా బెన‌ర్జీ పాల‌నా ప‌రంగా విశిష్ట సేవ‌లు అందించారు. ఈ త‌రుణంలో ఆమెకు అరుదైన గౌర‌వం ద‌క్కింది.

ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్ క‌తా లోని సెయింట్ జేవియ‌ర్స్ యూనివ‌ర్శిటీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు మ‌మ‌తా బెన‌ర్జీకి(Mamata Banerjee D Lit) డాక్ట‌రేట్ ఆఫ్ లిట‌రేచ‌ర్ పుర‌స్కారం అంద‌జేయ‌నుంది. వ‌చ్చే ఏడాది 2023 ఫిబ్ర‌వ‌రి 6న విశ్వ విద్యాల‌యం వార్షిక స్నాత‌కోత్స‌వంలో డాక్ట‌ర్ ఆఫ్ లెట‌ర్స్ ను ప్ర‌ధానం చేయ‌నుంది.

ఈ మేర‌కు ఈ అవార్డును ఇవ్వ‌నున్న‌ట్లు ఈ మేర‌కు త‌మ‌కు ఆమోదం తెల‌పాల‌ని కోరుతూ యూనివ‌ర్శిటీ పాల‌క మండ‌లి, వైస్ ఛాన్స‌లర్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న కూడా చేసింది.

ఈ విష‌యాన్ని సెయింట్ జేవియ‌ర్స్ యూనివ‌ర్శిటీ వీసీ ఫెలిక్స్ రాజ్ వెల్ల‌డించారు. డాక్ట‌రేట్ తీసుకునేందుకు సీఎం దీదీ స‌మ్మ‌తి తెలియ చేసినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు వీసీ.

ఇదిలా ఉండ‌గా ముఖ్యమంత్రిగా కొలువు తీరిన మ‌మ‌తా బెన‌ర్జీ రాష్ట్రంలో విద్యా ప‌రంగా ఎంతగానో కృషి చేశారంటూ పేర్కొన్నారు వీసీ. ఇదే విష‌యం గురించి కూడా రాష్ట్ర శాస‌న‌స‌భ ప్రాంగ‌ణంలో కూడా ప్ర‌క‌టించార‌ని తెలిపారు. అందుకే దీదీకి గౌర‌వ డాక్ట‌రేట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు.

Also Read : యూనిఫాం సివిల్ కోడ్ ను అమ‌లు చేస్తాం

Leave A Reply

Your Email Id will not be published!