SL vs AUS 2nd Odi : ఆసిస్ పై శ్రీ‌లంక ఉత్కంఠ విజ‌యం

26 ప‌రుగుల తేడాతో విక్ట‌రీ

SL vs AUS 2nd Odi : శ్రీ‌లంక‌లో వ‌న్డే సీరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియాకు కోలుకోలేని రీతిలో శ్రీ‌లంక(SL vs AUS 2nd Odi) షాక్ ఇచ్చింది. ఐదు

మ్యాచ్ లో వ‌న్డే సీరీస్ లో భాగంగా మొద‌టి మ్యాచ్ లో విక్ట‌రీ న‌మోదు చేసుకుని జోరు మీదున్న ఆసిస్ కు రెండో మ్యాచ్ లో చేదు అనుభ‌వం ఎదురైంది.

దుష్యంత చ‌మీర అద్భుత‌మైన బంతికి మాథ్యూ కుహ్నే మాన్ ను డిస్మిస్ చేయ‌డంతో 26 ప‌రుగుల తేడాతో శ్రీ‌లంక గెలుపు సాధించింది. ఈ

మ్యాచ్ విజ‌యాన్ని ప్రేక్ష‌కులు విప‌రీతంగా ఎంజాయ్ చేశారు.

ప‌ల్లెకెల్ మైదానంలో జ‌రిగిన రెండో వ‌న్డే ఉత్కంఠ భ‌రితంగా సాగింది. దీంతో ఇరు జ‌ట్లు చెరో విజ‌యాన్ని న‌మోదు చేసి స‌మానంగా నిలిచాయి.

వ‌ర్షం కురియ‌డంతో అంపైర్లు ఆట స‌మ‌యాన్ని 43 ఓవ‌ర్ల‌కే ప‌రిమితం చేశారు.

ఇక మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీ‌లంక(SL vs AUS 2nd Odi) 215 ప‌రుగులు చేసింది. ఇక 216 ర‌న్స్ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా 37.1

ఓవ‌ర్ల‌కే ఆలౌటైంది. శ్రీ‌లంక తొలి ఓట‌మి నుంచి పుంజుకుంది.

శ్రీ‌లంక ఫాస్ట్ బౌల‌ర్ చ‌మిక క‌రుణ ర‌త్నే మూడు వికెట్లు తీశాడు. ఆసిస్ ను దెబ్బ కొట్టాడు. ఆఖ‌రులో క్రీజులో ఉన్న మాథ్యూన్ చ‌మీర అద్భుత

బంతితో బోల్తా కొట్టించాడు.

ఇక క‌రుణ ర‌త్నే 3 వికెట్లు తీస్తే ధ‌నంజ‌య డిసిల్వ‌, దునిత్ వెల్ల లాగే , చ‌మీర చెరో రెండు వికెట్లు తీశారు. ఇదిలా ఉండ‌గా

ఆస్ట్రేలియా కేవ‌లం 19 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయింది.

అంత‌కు ముందు డిసిల్వ 34 ర‌న్స్ చేస్తే కుసాల్ మెండీస్ 36 ర‌న్స్ చేశాడు. ఇద్ద‌రూ క‌లిసి మూడో వికెట్ కు 61 ర‌న్స్ జోడించారు. ఆసిస్ జ‌ట్టులో

ఆరోన్ ఫించ్ 14, డేవిడ్ వార్న‌ర్ 37 మాత్ర‌మే చేశారు.

 

Also Read : ఇండియా ద‌క్షిణాఫ్రికా బిగ్ ఫైట్

Leave A Reply

Your Email Id will not be published!