SL vs SA Womens T20 WC : ఉత్కంఠ పోరులో శ్రీలంక విక్టరీ
అమ్మాయిలు ఆట అదుర్స్
SL vs SA Womens T20 WC : దక్షిణాఫ్రికా వేదికగా ప్రారంభమైంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టీ20 వరల్డ్ కప్. ప్రారంభ మ్యాచ్ ఆతిథ్య జట్టు సౌతాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది శ్రీలంక మహిళా క్రికెట్ జట్టు(SL vs SA Womens T20 WC). అన్ని ఫార్మాట్ లలో బలంగా ఉన్న సఫారీ టీమ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
శుక్రవారం కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ లో ప్రారంభ మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ దాకా నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ సాగింది. దక్షిణాఫ్రికాపై శ్రీలంక జట్టు మూడు పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. శ్రీలంక గెలుస్తుందని ఎవరూ ఊహించ లేదని ఆ జట్టు కెప్టెన్ చమరి అటపట్టు పేర్కొన్నారు.
ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా తాము ఆడడం జరిగిందన్నారు. ఈ ఫార్మాట్ లో ర్యాంకింగ్స్ లో కేవలం సంఖ్య మాత్రమేనని పేర్కొన్నారు కెప్టెన్.అతపట్టు 50 బంతులు ఎదుర్కొని 68 పరుగులు చేయడంతో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 129 రన్స్ చేసింది. అనంతరం 130 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు అద్భుతంగా ఆడింది.
అటు బౌలింగ్ లోనూ ఇటు ఫీల్డింగ్ లోనూ మెరుగైన ఆట తీరును ప్రదర్శించింది. శ్రీలంక జట్టు ప్రత్యర్థి జట్టును 126 పరుగులకే కట్టడి చేసింది. 9 వికెట్లను కూల్చింది. లంక జట్టులో లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్ ఇనోకా రణవీర మూడు వికెట్లు తీసింది. నాలుగు ఓవర్లలో 18 రన్స్ మాత్రమే ఇచ్చింది. ఇక సఫారీ జట్టులో కెప్టెన్ సునే లూస్ 28 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచింది.
Also Read : రాణించిన రోహిత్..జడేజా..పటేల్