SLBC Tunnel : 11 సంస్థలతో 5వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్

గంటలు గడిచే కొద్దీ టెన్షన్ పెరిగిపోతున్న నేపథ్యంలో..

SLBC Tunnel : SLBC టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగుతున్నాయి. షిఫ్ట్‌కు వందమందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. నాలుగు రోజులుగా నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి. అందరినీ సజీవంగా బయటికి తీసుకురావడానికి 11 సంస్థలు శ్రమిస్తున్నాయి. గంటలు గడిచే కొద్దీ టెన్షన్ పెరిగిపోతున్న నేపథ్యంలో, వీలైనంత త్వరగా లోపలికి చేరుకునేందుకు యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి.

SLBC Tunnel Rescue Operation 5th Day Going on..

ముఖ్యంగా రెస్క్యూ సిబ్బందికి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మిషన్) చాలెంజింగ్‌గా మారింది. ప్రమాదం జరిగిన దగ్గర టీబీఎం ముక్కలై, దాని విడిభాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో అక్కడ రెస్క్యూ చేయడం చాలా కష్టంగా మారింది. ఓవైపు బురద, ఇంకొవైపు సీపేజ్ వాటర్, మరోవైపు టీబీఎం ముక్కలతో అత్యంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి.

గ్యాస్ కట్టర్లను ఉపయోగించి ప్రక్రియను నిర్వహించాలనుకుంటే, ఉబికి వస్తున్న నీరు అడ్డంకిగా మారింది. రెస్క్యూ ఆపరేషన్‌లో NDRF, SDRF, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ మొత్తం పాల్గొంటున్నాయి. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ర్యాట్ హోల్ మైనర్స్, L&T, సింగరేణి, హైడ్రా టన్నెల్ ఎక్స్‌పర్ట్స్ మరియు మరికొన్ని కంపెనీలు తమ సేవలను అందిస్తున్నాయి.

మొత్తం 11 ఏజెన్సీలు నిరంతరం కోఆర్డినేషన్ చేస్తూ రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు.

Also Read : Trump Gold Card Visa : ఈబీ-5 వీసా పై మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్

Leave A Reply

Your Email Id will not be published!