Smita Sabharwal : నాణ్యమైన విద్యుత్ సరఫరా భేష్
ప్రభాకర్ రావుకు స్మితా సభర్వాల్ కితాబు
Smita Sabharwal : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె తెలంగాణ విద్యుత్ సరఫరాకు సంబంధించి ఆరా తీశారు. ఈ సందర్బంగా తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రావుతో భేటీ అయారు.
Smita Sabharwal Comment about Electricity
నాణ్యమైన విద్యుత్ సరఫరా గురించి ప్రశంసలు కురిపించారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తోందని వెల్లడించారు ప్రభాకర్ రావు.
నాణ్యమైన విద్యుత్ సరఫరాలో తెలంగాణను దేశంలోనే టాప్ లో నిలబెట్టేలా చేసిందని ప్రశంసలు కురిపించారు స్మితా సబర్వాల్(Smita Sabharwal). తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు 214లో 7778 ఎంబీ సామర్థ్యంగా ఉండేదని, ప్రస్తుతం అది 18,766 మెగా వాట్లకు చేరుకుందని తెలిపారు ఎండీ. గరిష్ట డిమాండ్ ను అందుకుందని స్పష్టం చేశారు.
ఇందుకు సంబంధించి తాను ప్రభాకర్ రావును అభినందించినట్లు తెలిపారు స్మితా సబర్వాల్. ఈ విషయాన్ని గురువారం ట్విట్టర్ వేదికగా ప్రస్తావించారు. ఫోటోలు పంచుకున్నారు.
Also Read : T-HUB Won : టి హబ్ కు అరుదైన పురస్కారం