Smriti Irani : ప్యాడ్స్ ధరించండి శుభ్రత పాటించండి
25 ఏళ్ల నాటి శానిటరీ ప్యాడ్స్ యాడ్
Smriti Irani : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) ఆసక్తికర సన్నివేశం గురించి పంచుకున్నారు. ప్రతి ఆడబిడ్డ తన దైనందిన జీవితంలో బహిష్టు కావడం సహజం. ఇందుకు సంబంధించి ప్రతి నెలా మూడు లేదా ఐదు రోజుల పాటు మెన్సస్ కు గురవుతారు. గత 30 ఏళ్ల కిందట దేశంలో బహిష్టు గురించి అమ్మాయిలు, బాలికలు, మహిళలకు అవగాహన ఉండేది కాదు. రాను రాను కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వాలు శానిటరీ ప్యాడ్స్ వాడాలంటూ ప్రచారం మొదలు పెట్టాయి.
ఇదే అంశానికి సంబంధించి తన అనుభవాన్ని పంచుకున్నారు కేంద్ర కేబినెట్ లో కొలువు తీరిన స్మృతి ఇరానీ. ఆమె నటిగా, మోడల్ గా గుర్తింపు పొందారు. తెలుగులో ఒక చిత్రంలో నటించారు. గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా బహిష్టు , పరిశుభ్రత ,నిషిద్దం గురించి 25 ఏళ్ల కిందట స్టే ఫ్రీ ప్రకటనను పంచుకున్నారు. ఇందుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ టీవీ వాణిజ్య ప్రకటనలో స్మృతీ ఇరానీ(Smriti Irani) ఆ ఐదు రోజుల గురించి నిరభ్యంతరంగా చర్చించవచ్చు అంటూ స్పష్టం చేసింది. బహిష్టు వచ్చే ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చేలా చేసింది. ప్రస్తుతం స్మృతీ ఇరానీ మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రిగా ఉన్నారు మోదీ కేబినెట్ లో.
మంత్రిగా కొలువు తీరాక ఆమె నిత్యం సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. ప్రతి అంశాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. తన రోజూ వారీ జీవితం, పని నుండి ఆసక్తికరమైన పోస్ట్ లు , స్పిప్పెట్ లను షేర్ చేస్తూనే ఉంటారు. స్మృతీ ఇరానీ(Smriti Irani) పోస్టులకు భారీ ఎత్తున ఆదరణ ఉంటుంది. మీరు పెద్ద వారని, తెలివైన వారని చెప్పేందుకు పీరియడ్స్ దేవుడు చెప్పిన మార్గం అని పేర్కొన్నారు .
Also Read : అమిత్ షా ఎన్నికల ప్రచారం రద్దు