Smriti Mandhana : ప‌ని చేయ‌ని మంధాన మంత్రం

తీవ్ర నిరాశ ప‌రిచిన ఆర్సీబీ కెప్టెన్

Smriti Mandhana WIPL : భార‌త మ‌హిళా క్రికెట్ చ‌రిత్ర‌లో మోస్ట్ పాపుల‌ర్ క్రికెట‌ర్ గా పేరు తెచ్చుకుంది ముంబై బ్యూటీ క్వీన్ స్మృతీ మంధాన‌. వ‌ర‌ల్డ్ క్రికెట్ లో తొలిసారిగా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సార‌థ్యంలో మ‌హిళ‌ల‌కు సంబంధించి ప్రిమీయ‌ర్ లీగ్ ను నిర్వ‌హిస్తోంది.

భారీ ఎత్తున ఆదాయం కూడా స‌మ‌కూరింది బీసీసీఐకి. ఇది ప‌క్క‌న పెడితే ముంబై వేదిక‌గా జ‌రిగిన వేలం పాట‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయింది స్మృతీ మంధాన‌(Smriti Mandhana WIPL).  

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) చేజిక్కించుకుంది. ఇదే క్ర‌మంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను కోచ్ గా నియ‌మించింది. అంద‌రినీ విస్తు పోయేలా చేసింది. ఇక ఐపీఎల్ ప్రారంభ‌మై లీగ్ మ్యాచ్ ముగిసే ద‌శ‌కు వ‌చ్చినా ఇప్ప‌టి వ‌ర‌కు రిచ్ లీగ్ లో ఇంకా బోణీ కొట్ట లేదు ఆర్సీబీ. 

యాజ‌మాన్యం ఎంతో న‌మ్మ‌కం ఉంచి స్మృతీ మంధాన‌కు(Smriti Mandhana) నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఎందుకో ఏమో కానీ అటు ఆట ప‌రంగా ఇటు నాయ‌క‌త్వ ప‌రంగా పూర్తిగా వైఫ‌ల్యం చెందింది. 

తీవ్ర ఒత్తిడికి లోన‌వుతోంది. ఇప్ప‌టికు ఆడిన 5 మ్యాచ్ ల‌లో వ‌రుస‌గా ఓడి పోతూ వ‌చ్చింది ఆర్సీబీ. తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో ప‌రాజ‌యం పాలైంది. 60 ర‌న్స్ తో ఓడి పోయింది. అనంత‌రం జ‌రిగిన మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ ఏకంగా 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది.

గుజ‌రాత్ జెయింట్స్ చేతిలో 11 ర‌న్స్ తేడాతో ఓటమి పాలైంది ఆర్సీబీ. విచిత్రం ఏమిటంటే యూపీ వారియ‌ర్స్ చేతిలో ఏకంగా 10 వికెట్లతో ప‌రాజ‌యం మూట గ‌ట్టుకుంది. 

చివ‌ర‌కు 5వ లీగ్ మ్యాచ్ లో 6 వికెట్ల తో ఓట‌మి పాలైంది. దాదాపు ఆర్సీబీ ఆశ‌లు గ‌ల్లంతు అయిన‌ట్లే. మ‌రి మంధాన ఇక‌నైనా ఫోక‌స్ పెడుతుందా లేక త‌నంత‌కు తాను త‌ప్పుకుంటుందా చూడాలి.

Also Read : ఆర్సీబీ ప‌రాజ‌యాల ప‌రంప‌ర‌

Leave A Reply

Your Email Id will not be published!