Smriti Mandhana : మంధాన క్లాసీ ఇన్నింగ్స్ మెస్మ‌రైజ్

వ‌న్డే కెరీర్ లో ఐదో సెంచ‌రీ

Smriti Mandhana : భార‌త మ‌హిళా క్రికెట‌ర్ స్మృతీ మంథాన ఇవాళ అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. త‌న కెరీర్ లో వ‌న్డే విభాగంలో ఏకంగా 5వ వ‌న్డే న‌మోదు చేసింది.

ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వ‌ర్యంలో కీవీస్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌హిళా పోటీల్లో భాగంగా విండీస్ తో జ‌రిగిన మ్యాచ్ లో మంధాన(Smriti Mandhana) అద్భుతంగా ఆడింది.

త‌న ప్ర‌తిభా పాట‌వాల‌ల‌తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు చుక్క‌లు చూపించింది. కౌర్ తో క‌లిసి భారీ స్కోర్ చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించింది. మొత్తం 119 బంతులు ఎదుర్కొన్న స్మృతీ మంధాన 123 ప‌రుగులు చేసింది.

ఇందులో 13 ఫోర్లు 2 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. ఫోర్ కొట్టి సెంచ‌రీ చేయ‌డం విశేషం. మంథాన క‌ళాత్మ‌క‌మైన ఇన్నింగ్స్ ఆడిందంటూ నెట్టింట్లో ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురుస్తున్నాయి.

ప్ర‌ముఖ కామెంటేట‌ర్ బోగ్లే సైతం విస్తు పోయాన‌ని పేర్కొన్నాడు. ఇక స్మృతీ మంథాన గ‌తంలో ఫ‌స్ట్ సెంచ‌రీని ఆస్ట్రేలియాపై చేసింది. కెప్టెన్ మిథాలీతో క‌లిసి 150 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పింది.

109 బంతుల్లో 102 ప‌రుగులు చేసింది. 2వ సెంచ‌రీని ఇంగ్లండ్ జ‌రిగిన ఐసీసీ క‌ప్ లో విండీస్ పై సెంచ‌రీ చేసింది మంధాన‌. 105 బాల్స్ ఎదుర్కొని శ‌త‌కం సాధించింది. దక్షిణాఫ్రికాతో మూడో సెంచ‌రీ న‌మోదు చేసింది.

135 ప‌రుగులు చేసి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుంది. నాల్గో సెంచ‌రీని న్యూజిలాండ్ పై సాధించింది. 105 ప‌రుగులు చేసి స‌త్తా చాటింది. తాజాగా విండీస్ పై దుమ్ము రేపింది. మొత్తంగా ఇవాల్టి సెంచ‌రీతో ఆమె ఐదు సెంచ‌రీలు న‌మోదు చేసింది కెరీర్ ప‌రంగా.

Also Read : ‘బిస్మా’ మాతృత్వ‌పు ఊయ‌ల లోకం ఫిదా

Leave A Reply

Your Email Id will not be published!