Smriti Mandhana T20 World Cup : స్మృతీ మంధాన మారథాన్ ఇన్నింగ్స్
సెమీస్ కు చేరడంలో కీలక పాత్ర
Smriti Mandhana T20 World Cup : భారత మహిళా క్రికెట్ లో స్టార్ ప్లేయర్ గా గుర్తింపు పొందిన ముంబై కి చెందిన స్మృతీ మంధాన మరోసారి మెరిసింది. తన అద్భుతమైన బ్యాటింగ్ తో సత్తా చాటింది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో కీలకమైన పోరులో కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఓపెనర్ షెఫాలీ వర్మతో కలిసి మొదటి వికెట్ కు 62 పరుగులు జోడించింది. అంతే కాదు కేవలం 56 బంతులు మాత్రమే ఎదుర్కొన్న స్మృతీ మంధాన ఏకంగా 9 ఫోర్లు 3 సిక్సర్లతో విరుచుకు పడింది. ఏకంగా 87 రన్స్ చేసింది. దీంతో భారత్ 6 వికెట్లు కోల్పోయి 155 రన్స్ చేసింది.
అనంతరం 156 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఐర్లాండ్ 8.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 54 రన్స్ చేసింది. ఇదే సమయంలో ఆటకు భారీ వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది.
అనంతరం డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్ ను గెలిచినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా క్రికెట్ ఫ్యాన్స్ తెగ ముచ్చట పడుతున్నారు. వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ లో గాయపడింది స్మృతీ మంధాన(Smriti Mandhana T20 World Cup). కీలక సమయంలో అద్భుతంగా ఆడినందుకు ఆనందంగా ఉందన్నారు మ్యాచ్ అనంతరం.
జట్టు సెమీ ఫైనల్ కు చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు మంధాన. ఇదిలా ఉండగా సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకుని భారత విజయంలో కీలక పాత్ర పోషించిన స్మృతీ మంధానకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టి20 వరల్డ్ కప్ గ్రూప్ బిలో ఇంగ్లండ్ తో పాటు భారత్ భారత్ కూడా రెండో ప్లేస్ లో నిలిచింది.
Also Read : బెస్ట్ కెప్టెన్ బౌలర్ గా రోహిత్ బుమ్రా