Smriti Mundhra : వెండి తెరపై స్మ్రితి ముంధ్రా ముద్ర
భారతీయ అమెరికన్ సాధించిన సక్సెస్
Smriti Mundhra : సాధించాలన్న తపన, ప్రత్యేకత చాటు కోవాలన్న కోరిక కొందరిని సక్సెస్ బాట పట్టిస్తుంది. అలాంటి వారిలో సినీ రంగంలో కొద్ది కాలంలోనే తనకంటూ ఓ బిగ్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న స్మ్రితి ముంధ్రా.
పురుషాధిక్య సమాజంలో తాను కూడా దర్శకురాలిగా నిరూపించు కుంటానని ఛాలెంజ్ చేసిన ధీరవనిత(Smriti Mundhra). ఆమె గురించి చెప్పాలంటే ముందుగా ఇతిహాసాలను పరిచయం చేసిన దిగ్గజ చిత్ర నిర్మాతన యష్ చోప్రాను ప్రత్యేకంగా ప్రస్తావించక తప్పదు.
ఆయన 1976లో కబీ కబీ , 1981లో సిల్ సిలా , 1991లో లామ్ , 1997లో దిల్ తో పాగల్ హై , 2004లో వీర్ జారా తీశాడు. కొన్నేళ్లుగా చిత్ర నిర్మాణాన్ని మార్చాడు. ప్రపంచ వ్యాప్తంగా బాలీవుడ్ కు పేరు తీసుకు వచ్చేలా చేశాడు యష్ చోప్రా. ఆయనకు నివాళిని ఘనంగా అర్పించింది స్మ్రితి ముంధ్రా.
రొమాంటిక్స్ డైరెక్టర్ గా ముద్ర పడింది ఆమె మీద. కానీ ఎక్కడా చెక్కు చెదర లేదు. ఇండియన్ రియాలిటీ టీవీ సీరీస్ , మ్యాచ్ మేకింగ్ , ఫీచర్ డాక్యుమెంటరీ ఫిల్స్ కు సహాయ దర్శకురాలిగా పని చేసింది. లాస్ ఏంజిల్స్ లో ఉన్న భారతీయ అమెరికన్. బాలీవుడ్ పట్ల ఆమెకు ఉన్న ప్రేమ సినిమాలను ప్రేమించేలా చేసింది.
ఆమె పేరెంట్స్ కల్వర్ సిటీలో ఒక స్క్రీన్ ను అద్దెకు తీసుకున్నారు. యుఎస్ లో బాలీవుడ్ చిత్రాల మొదటి ప్రదర్శనకారులు కావడం విశేషం.స్మ్రితి ముంధ్రా(Smriti Mundhra) డాక్యుమెంటరీస్ పై ఫోకస్ పెట్టారు. 35 మంది టాప్ బాలీవుడ్ వ్యక్తిత్వాలను ప్రతిబింబించేలా చేశారు.
కొన్ని సినిమాలు భారతీయ వ్యక్తిత్వాన్ని, సంస్కృతిని ప్రతిబింబించేలా చేస్తుందంటారు ఆమె. యష్ చోప్రాను మొదటగా ఎందుకు ఎంపిక చేసుకున్నానంటే ఆయనలో హృదయం దాగి ఉంది.
అంతకు మించిన వెండి తెర లోలోపేటే నిలిచి పోయిందన్నారు. స్మ్రితి ముంధ్రా తన కెరీర్ లో యష్ చోప్రాను ఇంటర్వ్యూ చేయడం. తాను ఎప్పటికీ గుర్తు పెట్టుకోదగిన జ్ఞాపకం అంటారు.
Also Read : చిత్ర గుర్నానీ సక్సెస్ కహానీ