Sonia Gandhi : అహింసా మార్గంలో నిరసన తెలపండి
యువతకు సోనియా గాంధీ లేఖ
Sonia Gandhi : దేశ వ్యాప్తంగా కేంద్రం తీసుకు వచ్చిన అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీంపై పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలు మిన్నంటాయి. పలు చోట్ల రైళ్లను తగుల బెట్టారు. బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు.
బీహార్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యూపీ, హర్యానా, తెలంగాణ, తదితర రాష్ట్రాలలో ఉగ్ర రూపం దాల్చారు యువకులు. ఇక సికింద్రాబాద్ లో చోటు చేసుకున్న ఘటన పక్కా స్కెచ్ ప్రకారమే జరిగిందని తేల్చారు పోలీసులు.
అగ్నిపథ్ స్కీంపై రోజు రోజుకు అన్ని వైపుల నుంచి నిరసనలు పెరుగుతుండడంతో కేంద్రం పునరాలోచనలో పడింది. శనివారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సారథ్యంలో సాయుధ దళాల ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు.
ఇంకో వైపు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మూడేళ్ల పాటు సడలింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జీ చేయడం, కాల్పులకు పాల్పడడంతో తెలంగాణలోని వరంగల్ కు చెందిన రాకేశ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ విషయం తెలిసిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi) సుదీర్ఘ లేఖ రాశారు. నిరసనకారులు, ఆందోళనకారులకు మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ స్కీంకు ఎలాంటి పద్దతి లేకుండా పోయిందని మండిపడ్డారు. నిరసన తెలపండి. కానీ శాంతియుత మార్గంలో, అహింసా పద్దతిలో ప్రయత్నం చేయాలని సోనియా గాంధీ సూచించారు.
తమ పార్టీ మీ ఆకాంక్షలకు అనుగుణంగా పోరాడుతుందని స్పష్టం చేసింది మేడం.
Also Read : అగ్నిపథ్ స్కీంను విరమించుకోండి – సీఎం