Sonia Gandhi Comment : బీజేపీ స్కెచ్ సోనియాకు చెక్

సార్వ‌భౌమాధికారం వివాదం

Sonia Gandhi Comment : దేశంలో ఆక్టోప‌స్ లా విస్త‌రించిన భార‌తీయ జ‌న‌తా పార్టీ మెల మెల్ల‌గా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌రోసారి పాగా వేసేందుకు పావులు క‌దుపుతోంది. వ‌చ్చిన అవ‌కాశాల‌ను అందిపుచ్చు కోవ‌డం, లేదంటే వివాదాల‌ను రాజేసి ల‌బ్ది పొంద‌డం ఎలా అనే దానిపై ఫోక‌స్ పెట్టింది.

ఇప్ప‌టికే 2019లో ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మోదీని అన‌రాని మాట‌లు అన్నాడ‌ని కేసు న‌మోదైంది. సూర‌త్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంట‌నే రాహుల్ గాంధీ ఎంపీపై అన‌ర్హ‌త వేటు ప‌డింది. ఆపై అధికారిక బంగ్లాను కూడా ఖాలీ చేయించింది కేంద్రం.

ఇది ఒక ర‌కంగా క‌క్ష సాధింపు చ‌ర్య‌గా కాంగ్రెస్ పేర్కొంటుండ‌గా కాదు త‌గిన శిక్ష ప‌డిందంటోంది బీజేపీ. ఎందుకంటే భార‌త దేశం ప‌రువును ప్ర‌పంచ వేదిక‌పై తీసి వేసేలా రాహుల్ గాంధీ కామెంట్స్ చేస్తున్నాడంటూ ఆరోపించింది.

దానిపై నానా యాగి చేసింది కేంద్రం. ఎట్ట‌కేల‌కు ఒక వికెట్ ప‌డింది. మ‌రో వైపు ఏఐసీసీకి పెద్ద దిక్కు సోనియా గాంధీనే. ఆమె సౌమ్యురాలు. ఎప్పుడో కానీ ఆమెకు కోపం రాదు. కానీ ఉన్న‌ట్టుండి సోనియాను(Sonia Gandhi Comment) కూడా రంగంలోకి దింపింది భార‌తీయ జ‌న‌తా పార్టీ. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా క‌ర్ణాట‌క‌కు సార్వ భౌమాధికారం ప్ర‌త్యేకంగా ఉండాల‌ని ప్ర‌స్తావించింద‌ని పేర్కొంది.

ఇందుకు సంబంధించి మే 6న ఏఐసీసీ త‌న అధికారిక ట్విట్ట‌ర్ లో ప్ర‌స్తావించింది..షేర్ చేసిందంటూ ఆరోపించింది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది బీజేపీ. ఆ వెంట‌నే ఈసీ ఆగ‌మేఘాల మీద ఏఐసిసీకి నోటీసు జారీ చేసింది. ఈ మేర‌కు ఆ పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేసింది.

హుబ్బ‌ళ్లిలో సోనియా ప్ర‌స్తావించంటూ ఈసీ లేఖ‌లో పేర్కొంది కూడా. విచిత్రం ఏమిటంటే దేశంలో ఎంద‌రో రాజ‌కీయ నాయ‌కులు దారుణంగా మాట్లాడుతున్నారు. ప్ర‌త్య‌క్షంగా దాడుల‌కు దిగుతున్నారు. నేర‌స్థులు, మాఫియాలు, డాన్ లు, బ‌డా వ్యాపార‌వేత్త‌లు, దేశాన్ని దోచుకుంటున్న ఆర్థిక నేర‌గాళ్లు, హంత‌కులు, మాయ‌గాళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే అత్య‌ధిక శాతం వారే ప్ర‌జా ప్ర‌తినిధులుగా చెలామ‌ణి అవుతున్నారు.

కానీ ఇప్ప‌టి దాకా ఈసీ వేటు వేయ‌లేదు. కానీ ఒకే ఒక్క ప‌దాన్ని తీసుకుని నోటీసులు జారీ చేయ‌డాన్ని కాంగ్రెస్ తో పాటు విప‌క్షాలు సైతం తీవ్ర అభ్యంత‌రం తెలిపాయి. ఇది ప‌క్క‌న పెడితే అస‌లు సార్వ‌భౌమాధికారం అంటే ఏంటి. భార‌త రాజ్యాంగం ఏం చెబుతోంది..స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌లిగి ఉండ‌డం అని అర్థం. కానీ సీన్ రివ‌ర్స్ అయ్యింది.

ఇక కాంగ్రెస్ పార్టీకి ఖ‌ర్గే చీఫ్ అయినా నడిచేదంతా సోనియా గాంధీ(Sonia Gandhi) పేరు మీదే. ఇక రాహుల్ గాంధీ ఒక్క‌డే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఏకి పారేస్తుండ‌డం బీజేపీకి న‌చ్చ‌డం లేదు. ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌ట్టు ఇద్ద‌రినీ లేకుండా చేస్తే బెట‌ర్ అని ఆలోచిస్తోంది. కాషాయ పార్టీ సిద్దాంతం ఒకే పార్టీ ఒకే భాష ఒకే దేశం ఉండాల‌న్న‌ది ఆలోచ‌న‌.

ప్ర‌తిప‌క్షాలు లేని దేశం కోరుకుంటోంది. దానికి బార‌త రాజ్యంగం అంటే చిరాకు. న్యాయ వ్య‌వ‌స్థ అన్నా వెట‌కారం. ఏది ఏమైనా వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కైనా ఆచితూచి కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంది. లేక పోతే పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక త‌ప్ప‌దు.

Also Read : మోదీ గౌర‌వించ‌డం నేర్చుకో – గెహ్లాట్

Leave A Reply

Your Email Id will not be published!