Ashok Gehlot : అశోక్ గెహ్లాట్ వైపు సోనియా మొగ్గు
కాంగ్రెస్ చీఫ్ రేసులో అశోక్ గెహ్లాట్
Ashok Gehlot : రోజులు దగ్గర పడే కొద్దీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. పార్టీ అధ్యక్ష పదవి కోసం వచ్చే అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి.
నామినేషన్లు దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చారు ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ మధుసూదన్ మిస్త్రీ. అక్టోబర్ 8న తుది పరిశీలన ఉంటుంది.
మొత్తం పార్టీలో 9,000 మంది సభ్యులు ఉన్నారు. వీరందరికీ ఓటు హక్కు ఉంటుంది. పూర్తి పారదర్శకంగా ఎన్నికలు జరగాలని ఐదుగురు పార్టీకి చెందిన ఎంపీలు లేఖ రాయడం కలకలం రేపింది.
ఇదే సమయంలో తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ తాను కూడా బరిలో ఉంటానని ప్రకటించారు. మరో వైపు గాంధీ ఫ్యామిలీకి విధేయుడిగా పేరు పొందారు రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot).
దీంతో మేడం సోనియా గాంధీ(Sonia Gandhi) పూర్తిగా ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరో వైపు ఇప్పటికే రాజస్తాన్, తమిళనాడు, బీహార్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు రాహుల్ గాంధీ చీఫ్ గా ఉండాలంటూ తీర్మానాలు చేశాయి.
ఆ కాపీలను పార్టీ హైకమాండ్ కు పంపించాయి. మొదటగా తీర్మానం చేసింది మాత్రం రాజస్తాన్ రాష్ట్రమే. ఇక పార్టీ చీఫ్, సీఎంగా ఉన్న గెహ్లాట్ ముందు నుంచీ రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉండాలని కోరుతున్నారు.
కానీ గత కొంత కాలం నుంచీ గాంధీ ఫ్యామిలీకి పార్టీ చీఫ్ ఇవ్వడంపై రాద్దాంతం జరుగుతోంది. పార్టీలో ప్రస్తుతం గాంధీ ఫ్యామిలీ వర్సెస్ నాన్ గాంధీ లీడర్ల మధ్య వార్ నడుస్తోంది.
ఈ తరుణంలో అందరికీ ఆమోద యోగ్యుడిగా పేరొందిన గెహ్లాట్ ను పార్టీ చీఫ్ చేస్తే బావుంటుందని సోనియా గాంధీ భావిస్తున్నట్లు టాక్.
Also Read : ఎవరైనా అధ్యక్ష పదవికి పోటీ చేయొచ్చు