Sonia Rahul Gandhi & ED : ఈడీ స‌మన్ల వెనుక ఉన్న క‌థేంటి

నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక కేసు వ్య‌వ‌హారం

Sonia Rahul Gandhi & ED : దేశ వ్యాప్తంగా మ‌రోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌త్యేకించి బీజేపీయేత‌ర రాష్ట్రాలనే టార్గెట్ చేయ‌డాన్ని త‌ప్పు ప‌డుతున్నాయి విప‌క్షాలు.

ఇది ప‌క్క‌న పెడితే గ‌త కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీని, మోదీని టార్గెట్ చేస్తూ వ‌స్తోంది. ఈ త‌రుణంలో ఆ పార్టీకి చెందిన తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ, త‌న‌యుడు వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఈడీ(ED).

ఈ మేర‌కు ఈడీ త‌మ ముందు హాజ‌రు కావాలంటూ స‌మ‌న్లు జారీ చేసింది. ఇది ఆ పార్టీని ఒక్క‌సారిగా కుదిపేసింది. ఈ మేర‌కు సోనియా , రాహుల్ గాంధీల‌ను ప్ర‌శ్నించ‌నుంది.

మ‌నీ లాండ‌రింగ్ వ్య‌వ‌హారానికి సంబంధించి న‌మోదు చేసిన కేసుకు సంబంధించి ఈడీ రంగంలోకి దిగింది. పీఎంఎల్ఏ క్రిమిన‌ల్ సెక్ష‌న్ల కింద వారి వాంగ్మూలాన్ని న‌మోదు చేయ‌నుంది.

నేష‌న‌ల్ హెరాల్డ్ వార ప‌త్రిక‌కు సంబంధించిన కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ(Sonia Rahul Gandhi)కి ఈ స‌మ‌న్లు అందాయి. ప్ర‌స్తుతం

రాహుల్ గాంధీ ఇండియాలో లేరు. ఆయ‌న విదేశాల్లో ఉన్నారు.

ఈనెల 5 త‌ర్వాత ఈడీ ముందు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. కాగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇదంతా క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగ‌మేన‌ని, రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ త‌రుణంలో దీనిని అడ్డం పెట్టుకుని రాజ‌కీయంగా ల‌బ్ది పొందాల‌ని బీజేపీ చూస్తోందంటూ ఆరోపించారు ఆ పార్టీ ఎంపీ, సీనియ‌ర్ న్యాయ‌వాది

అభిషేక మ‌ను సింఘ్వీ. ఆయ‌న బుధ‌వారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

మ‌నీ మార్పిడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవ‌న్నారు. దానిని త‌ప్ప‌నిస‌రిగా తాము ఎదుర్కొని తీరుతామ‌న్నారు. ప్ర‌ధాన స‌మ‌స్య‌ల

నుంచి దేశ ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు ఇలా చేస్తోందంటూ ఆరోపించారు.

ఈ కేసును 2015లో ఈడీ మూసి వేసింద‌ని , ఆనాటి అధికారుల‌ను తొల‌గించి కొత్త వారిని తీసుకు వ‌చ్చి మ‌ళ్లీ కేసు తెరిచిందంటూ మండిప‌డ్డారు.

నేష‌న‌ల్ హెరాల్డ్ అసోసియేటెడ్ జ‌ర్న‌ల్స్ లిమిటెడ్ (ఏజేఐఎల్) ప్ర‌చురించ‌బ‌డింది.

యంగ్ ఇండియ‌న్ ప్రైవేట్ లిమిటెడ్ యాజ‌మాన్యంలో ఉంది. వీటి కొనుగోలులో మోసం, కుట‌, నేర‌పూరిత విశ్వాస ఉల్లంఘ‌న జ‌రిగిందంటూ అభియోగాలు మోపింది.

విచార‌ణ‌లో భాగంగా కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, ప‌వ‌న్ బ‌న్సాల్ ను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ప్ర‌శ్నించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ,

ఇత‌రులు యంగ్ ఇండియ‌న్ ప్రైవేట్ తో మోసం, దుర్వినియోగానికి కుట్ర ప‌న్నారని ఆరోపిస్తూ 2013లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఎంపీ సుబ్ర‌మ‌ణ్య స్వామి ఫిర్యాదు చేశారు.

పీఎంఎల్ఏ క్రిమిన‌ల్ రూల్స్ ప్ర‌కారం ఈడీ తాజా కేసు న‌మోదు చేసింది. ఈ వ్య‌వ‌హారం ఇంకా ఢిల్లీ కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెయిల్ పొందారు.

Also Read : జైన్ భ‌క్తుడు త‌ప్పు చేయ‌డు – కేజ్రీవాల్

Leave A Reply

Your Email Id will not be published!