Sonu Nigam : హిందీ భాష‌పై సోనూ నిగ‌మ్ కామెంట్

త‌మిళులు హిందీలో ఎందుకు మాట్లాడాలి

Sonu Nigam : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్ ఇంకా దేశ వ్యాప్తంగా చ‌ర్చ కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌ధానంగా సినీ రంగానికి చెందిన వారి మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది.

బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌న్ చేసిన కామెంట్స్ పై క‌ర్ణాట‌క సీఎం బొమ్మైతో పాటు మాజీ సీఎంలు సిద్ద‌రామ‌య్య‌, హెచ్ డి కుమార స్వామి సీరియ‌స్ అయ్యారు. త‌మ భాష హిందీ కంటే ప్రాచీన‌మైన‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మిళులు హిందీలో ఎందుకు మాట్లాడాలంటూ ప్ర‌శ్నించారు సింగ‌ర్ సోనూ నిగ‌మ్(Sonu Nigam). ఇప్ప‌టికే అనేక అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్న దేశంలో ఈ వివాదం అవాంఛ‌నీయ‌మైన ఉద్రిక్త‌త‌ను సృష్టిస్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

భార‌త రాజ్యాంగంలో హిందీనే మాట్లాడాల‌ని రాసి లేద‌న్నారు. ఇప్ప‌టికీ మ‌న కోర్టుల్లో తీర్పులు ఇంగ్లీష్ లోనే ఉన్నాయ‌ని సోనూ నిగ‌మ్ గుర్తు చేశారు.

దేశంలో అత్య‌ధికంగా మాట్లాడే భాష హిందీ అయిన‌ప్ప‌టికీ హిందీయేత‌ర మాట్లాడే వారిపై ఆ భాష‌ను రాజ్యాంగంలో జాతీయ భాష‌గా మాట్లాడాలంటూ నిర్దేశించి లేద‌ని పేర్కొన్నారు.

అజ‌య్ దేవ‌గ‌న్, సుదీప్ సంజీవ్ మ‌ధ్య జ‌రిగిన ట్విట్ట‌ర్ లో ట్వీట్ల యుద్దం పై స్పందించారు. నా జ్ఞానం ప్ర‌కారం రాజ్యాంగంలో హిందీ జాతీయ భాష‌గా పేర్కొన‌లేద‌ని తెలిపారు.

దీనికి సంబంధించి నిపుణుల‌ను కూడా సంప్ర‌దించాన‌ని చెప్పారు సోనూ నిగ‌మ్. హిందీతో పాటు సంస్కృతం, త‌మిళం కూడా ప్రాచీన‌మైన భాష‌లని పేర్కొన్నారు.

తాజాగా సోనూ నిగ‌మ్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : త‌న పరిచయాలను బలేగా వాడేసిన సుమ

Leave A Reply

Your Email Id will not be published!