Sony Time 100 : అమెరికాకు (America) చెందిన ప్రముఖ దిగ్గజ సంస్థ టైమ్ (Time) ప్రతి ఏటా 100 మంది అత్యంత జనాదరణ (Sony Time 100)కలిగిన వ్యక్తులు, సెలబ్రిటీలు, కంపెనీలను ఎంపిక చేస్తుంది.
ఈ ఏడాది 2022 సంవత్సరానికి గాను 100 కంపెనీలను ప్రకటించింది. ఇందులో కోట్లాది మందికి చేరువై, వినోదాన్ని పంచుతున్న సోనీ నెట్ వర్క్ (Sony Time 100) టెలివిజన్ కార్పొరేషన్ కంపెనీ టాప్ లో నిలిచింది.
సోనీ (Sony) తో పాటు పలు కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. దిగ్గజ కుబేరుడు ఎలన్ మస్క్ సారథ్యంలోని టెస్లా కూడా చేరింది.
ఆయా కంపెనీలను ప్రభావం, ఔచిత్యం, ఆవిష్కరణ, నాయకత్వం, భవిష్యత్తు ఆశయాలు, గతంలో సాధించిన విజయాలు వంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది టైమ్ (Time) సంస్థ.
అత్యున్నత అనుభవం కలిగిన వ్యక్తులతో ఎంపిక కమిటీ వీటిని పరిశీలిస్తుంది. అన్నీ ఓకే అనుకున్నాకే 100 జాబితా కంపెనీలను డిక్లేర్ చేస్తుంది. ఇందుకు సంబంధించి ప్రాసెస్ పూర్తయ్యాక టైమ్ (Time) డిక్లేర్ చేసింది.
ఈ కంపెనీల జాబితాలో ప్రపంచంలో టాప్ కార్ల తయారీ కంపెనీలలో మూడు కార్ల కంపెనీలు చోటు దక్కించు కోవడం విశేషం. ఇందులో రివియన్ ఒకటి. ఈవీ తయారీదారుగా ఉంది.
స్టార్టప్ కంపెనీగా పేరొందింది. మరో దిగ్గజ కంపెనీ. ఇప్పటికే కార్ల తయారీలో టాప్ లో కొనసాగుతున్న ఫోర్డ్ కూడా చేరింది. టెస్లా (Tesla) కంటే ముందంజలో ఉండడం విశేషం.
చైనా (China) కు చెందిన తయారీదారు బీవైడీ కూడా ఉంది. అమెరికా (America) అంతటా సరుకు రవాణా ఎలా జరుగుతుందో మార్చే మొదటి ప్రధాన ఒప్పందంలో ఈ కంపెనీ భాగస్వామిగా ఉంది. టెస్లా (Tesla) కూడా ఉంది.
Also Read : ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’గా శాంతిప్రియ