Vijay Sai Reddy : ఇక ‘విజయ సాయి’ ఛానల్..పేపర్
ప్రకటించిన వైసీపీ ఎంపీ రెడ్డి
Vijay Sai Reddy : తెలుగు రాష్ట్రాలలో పేరొందిన వారంతా ఇప్పటికే ప్రచురణ, ప్రసార, డిజిటల్ మాధ్యమాల్లోకి వచ్చేశారు. ఇప్పటికే రామోజీ రావు పచ్చళ్ల నుంచి పేపర్, టీవీ రంగంలోకి ఎంటర్ అయ్యారు. ఆపై చిట్ బిజినెస్ కూడా చేస్తున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో రామోజీ రావు ఏం చెబితే అదే.
ఆ తర్వాత ఉదయం వచ్చాక కొంత జోరు తగ్గింది. కానీ దాసరి నారాయణ రావు దానిని కంటిన్యూ చేయలేక పోయారు. తెలంగాణ ఉద్యమం ఊపందు కోవడం ఇతర వార్తలకు ప్రయారిటీ తగ్గడంతో రామోజీ, జగన్ స్టార్ట్ చేసిన పేపర్లకు అంతగా ఆదరణ లభించ లేదు.
ఇదే సమయంలో ఆంధ్రజ్యోతి, వార్తకు ప్రయారిటీ పెరిగింది. ఈ రెండు పేపర్లు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను తెలియ చేయడంలో కీలక పాత్ర పోషించాయి.
ఆ తర్వాత జీ గ్రూప్ తీసుకు వచ్చిన జి24 గంటలు, హెచ్ఎంటీవీ, వినోద్ స్టార్ట్ చేసిన వీ6 , రాజ్ న్యూస్, టీ న్యూస్, నమస్తే తెలంగాణ ఇలా లెక్కకు మించి పత్రికలు, ఛానళ్లు కొలువు తీరాయి.
ఇక రవి ప్రకాశ్ చేతిలో ఉన్న టివి9 నేటికీ ఇరు తెలుగు రాష్ట్రాలలో టాప్ లో కొనసాగుతోంది. ప్రతి దానిని సెన్సేషన్ చేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ఇది పని చేస్తోంది. ఆ తర్వాత కేసీఆర్ ను గెలకడంతో ఏకంగా రవి ప్రకాశ్ ను దాని నుంచి వెళ్లి పోయేలా చేశారు. ప్రస్తుతం ఇది ప్రముఖ రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న మైహోం రామేశ్వర్ రావు చేతిలోకి వెళ్లి పోయింది.
ప్రస్తుతం టీవీ5, ఎన్టీవీ, తదితర ఛానళ్లు ఏపీని మోస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక సోషల్ మీడియా రావడంతో ఈ ఛానళ్లు, పేపర్లను ఎవరూ పట్టించు కోవడం లేదు. ఇక ఇంగ్లీష్ పేపర్లు, చానళ్ల గురించి ఇక్కడ మాట్లాడటం వేస్ట్. ఎందుకంటే వాటన్నింటికి నార్త్ కు సంబంధించిన అంశాలనే ప్రధాన వార్తలుగా ఉంటాయి.
తాజాగా వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి(Vijay Sai Reddy ) సంచలన ప్రకటన చేశారు. కొన్ని పత్రికలు, ఛానళ్లు తనను టార్గెట్ చేయడాన్ని తప్పు పట్టారు. తాను కూడా త్వరలో న్యూస్ ఛానల్, పత్రిక తీసుకు వస్తానని ప్రకటించారు. ఆపై రియల్ ఎస్టేట్ లోకి కూడా ఎంటర్ అవుతానని వెల్లడించారు.
మొత్తంగా మరో ఛానల్, పేపర్ రానుండడంతో జర్నలిస్టులకు ఇక పండగే అన్నమాట.
Also Read : దోషులు ఎవరో తేల్చకపోతే ధర్నా – రేవంత్