Sourav Ganguly Comment : ‘దాదా’ ఎప్ప‌టికీ బెంగాల్ టైగ‌రే

ప‌వ‌ర్ పాలిటిక్స్ బ‌లైన గంగూలీ

Sourav Ganguly Comment : నిన్న‌టి దాకా సౌర‌వ్ గంగూలీ హీరో. మోస్ట్ పాపుల‌ర్ కూడా. గ‌త కొంత కాలంగా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డును శాసించాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే ముందుండి న‌డిపించాడు. దాదా లైఫ్ స్టైలే అంత‌. తాను కావాల‌ని అనుకున్న‌ది చేసి తీరాలంటాడు.

త‌న మాటే నెగ్గాలంటాడు. ఇందులో త‌ప్పేమీ లేదు. విజ‌యాన్ని కాంక్షించే వాళ్ల‌కు, ప్ర‌త్యేకంగా త‌మ‌దైన ముద్ర ఉండాల‌ని కోరుకునే వాళ్ల‌కు ఉండే క‌సి

గంగూలీలో కూడా ఉంది. అందుకే అత‌డిని బెంగాలీలు ముద్దుగా దాదా అని పిలుచుకుంటారు.

ఈ దేశంలో పులులలో బెంగాల్ పులుల‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. అందుకే సౌర‌వ్ గంగూలీని(Sourav Ganguly) బెంగాల్ టైగ‌ర్ అని కూడా పిలుచుకుంటారు ఆయ‌న‌ను విప‌రీతంగా అభిమానించే వారు. దేశంలోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా గంగూలీకి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రినీ హ‌ర్ట్ చేసే మ‌న‌స్త‌త్వం కాదు త‌న‌ది. కానీ డేరింగ్ ..డాషింగ్ ప‌ర్స‌నాలిటీ గంగూలీది. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో మ‌రోసారి వార్త‌ల్లో

హాట్ టాపిక్ గా మారారు. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ఆదాయం క‌లిగిన బీసీసీఐ సంస్థ‌కు మ‌రోసారి బాస్ కావాల‌ని అనుకున్నారు.

కానీ త‌న చుట్టూ ఉంటూనే తెర వెనుక చ‌క్రం ఎవ‌రు తిప్పారనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. గ‌తంలో పూర్తిగా ప్రొఫెష‌న్స‌ల్ గా ఉండేది బీసీసీఐ. రాను రాను రాజ‌కీయాల‌కు వేదిక‌గా మారింది. కొత్త‌గా కొలువుతీరిన పాల‌క‌వ‌ర్గంలో బీసీసీఐ బాస్ రోజ‌ర్ బిన్నీ త‌ప్పా ఎవ‌రూ క్రికెట్ ఆడిన దాఖ‌లాలు లేవు.

కానీ వీళ్ల చేతుల్లోనే ఇప్పుడు సంస్థ కొలువు తీర‌నుంది. కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా త‌న‌యుడు జే షా మ‌రోసారి కార్య‌ద‌ర్శిగా ఎన్నిక‌య్యారు. ఇక రాజీవ్ శుక్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్య‌క్తి. మిగ‌తా వారిలో ఒక‌రు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ త‌న‌యుడు త‌రుణ్ ధుమాల్ ఏకంగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ కు చైర్మ‌న్ గా ఎంపిక‌య్యాడు.

మొత్తంగా ఇప్పుడు బీసీసీఐ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆఫీసుగా మారి పోయింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో సౌర‌వ్ గంగూలీ

ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రేసులో ఉంటార‌ని అంతా భావించారు. త‌ను కూడా పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపించాడు.

అక్టోబ‌ర్ 20 ఐసీసీ చైర్మ‌న్ కోసం అప్లై చేసేందుకు డెడ్ లైన్. దాదా పోటీ చేయాలంటే త‌ప్ప‌నిస‌రిగా బీసీసీఐ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. కానీ

ప‌నిగ‌ట్టుకుని సౌర‌వ్ గంగూలీకి పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ను త‌గ్గించాల‌ని అనుకున్నారో లేక బీజేపీలో చేర‌లేద‌ని భావించారో తెలియ‌దు కానీ మొత్తంగా కోలుకోలేని షాక్ ఇచ్చారు.

ఇదే స‌మ‌యంలో బీసీసీఐ నుంచి నిష్క్ర‌మించేలా చేశార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ. ఆమె మొద‌టి నుంచీ గంగూలీని

ప్రోత్స‌హిస్తూ వ‌స్తున్నారు. ఎందుకంటే మోస్ట్ పాపుల‌ర్ హీరోగా అత‌డికి ఫాలోయింగ్ ఉంది. జే షా కార్య‌ద‌ర్శిగా ఎన్నికైతే గంగూలీకి ఎందుకు అవ‌క‌వాశం ఉండ‌ద‌ని ప్ర‌శ్నించారు.

ఆపై ఐసీసీకి రెఫ‌ర్ చేయాలంటూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇది దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో

చివ‌ర‌కు గంగూలీకి రిక్త హ‌స్త‌మే మిగిలింది. ప‌ద‌వి నుంచి త‌ప్పించ గ‌లిగారేమో కానీ క్రికెట‌ర్ గా ఎల్ల‌ప్ప‌టికీ దాదా ఎప్ప‌టికీ టైగ‌ర్ అన్న‌ది గుర్తు పెట్టుకోవాలి.

Also Read : భార‌త్ ఎవ‌రి మాట విన‌దు – అనురాగ్ ఠాకూర్

Leave A Reply

Your Email Id will not be published!