Sourav Ganguly : జో రూట్ ఆట తీరు అద్భుతం – గంగూలీ

న్యూజిలాండ్ పై ఇంగ్లండ్ విజ‌యం

Sourav Ganguly : లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్టులో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ను ఓడించి అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ ఆట‌గాడిగా పేరొందిన జో రూట్ అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు.

జ‌ట్టు గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు. జో రూట్ అజేయంగా 115 ప‌రుగులు చేశాడు. బ‌న్ స్ట్రోక్స్ సార‌థ్యంలోని ఇంగ్లండ్ మూడు టెస్టు మ్యాచ్

ల సీరీస్ లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

రూట్ మొద‌టి టెస్టు 4వ రోజు త‌న సెంచ‌రీ చేశాడు. ఇదే స‌మ‌యంలో టెస్టు క్రికెట్ లో ఏకంగా 10,000 ప‌రుగులు చేశాడు.

ఈ మైలు రాయి సాధించిన వెంట‌నే జో రూట్ ను ప్ర‌త్యేకంగా అభినంద‌న‌ల‌తో ముంచెత్తాడు భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌర‌వ్ గంగూలీ(Sourav Ganguly).

ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించాడు. జో రూట్ ను ఆల్ టైట్ గ్రేట్ అంటూ కితాబు ఇచ్చాడు. ఒత్తిడిలో సైతం మైదానంలో నిల్చుని జ‌ట్టుకు

అండ‌గా నిలిచాడు. గెలుపు సాధించ‌డంలో తోడ్ప‌డ్డాడంటూ పేర్కొన్నాడు దాదా(Sourav Ganguly).

ఇదిలా ఉండ‌గా ఇంగ్లండ్ కు చెందిన అలిస్ట‌ర్ కుక్ త‌ర్వాత 10 వేల ప‌రుగులు టెస్టులో చేసిన రెండో ఆట‌గాడిగా జో రూట్ నిలిచాడు. అరుదైన

ఘ‌న‌త సాధించాడు.

న్యూజిలాండ్ తో జ‌రిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ ముందు 277 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ముందుంచింది. ఆతిథ్య జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి

69 ప‌రుగులు చేసి క‌ష్టాల్లో ప‌డింది.

ఆ స‌మ‌యంలో బ‌రిలోకి దిగిన మాజీ కెప్టెన్ జో రూట్ , ప్ర‌స్తుతం కెప్టెన్ బెన్ స్టోక్స్ తో క‌లిసి 90 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. 54 ప‌రుగులు చేశాక బెన్ స్టోక్స్ త‌న వికెట్ కోల్పోయాడు.

అప్పుడు స్కోర్ 5 వికెట్ల‌కు 159 ర‌న్స్. అనంత‌రం బ‌రిలోకి దిగిన వికెట్ కీక‌ప‌ర్ , బ్యాట‌ర్ బెన్ ఫోక్స్ జో రూట్ తో క‌లిసి ఆరో వికెట్ కు ఏకంగా 120 ప‌రుగులు జోడించారు. న్యూజిలాండ్ ను 5 వికెట్ల తేడాతో ఓడించారు.

Also Read : భార‌త రెజ్ల‌ర్ స‌రిత అరుదైన ఘ‌న‌త‌

Leave A Reply

Your Email Id will not be published!