Sourav Ganguly : రాణించ‌డం కోహ్లీ చేతుల్లోనే ఉంది

విరాట్ కోహ్లీపై గంగూలీ కామెంట్స్

Sourav Ganguly : భార‌తీయ క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ ) ప్రెసిడెంట్ సౌర‌వ్ గంగూలీ(Sourav Ganguly) సంచల‌న కామెంట్స్ చేశాడు. భార‌త స్టార్ ప్లేయ‌ర్ , మాజీ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గ‌త కొంత కాలం నుంచీ పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు.

ఒకానొక ద‌శ‌లో అత‌డిని త‌ప్పించాలంటూ పెద్ద ఎత్తున తాజా, మాజీ క్రికెట‌ర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే భార‌త క్రికెట్ లో పెద్ద ఎత్తున యువ ఆట‌గాళ్లు రాణిస్తున్నార‌ని, వారికి త‌ను త‌ప్పుకుని చాన్స్ ఇవ్వాలంటూ మాజీ భార‌త జ‌ట్టు కెప్టెన్ క‌పిల్ దేవ్ కామెంట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఆయ‌న వ్యాఖ్య‌లపై రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) ఘాటుగా స్పందించాడు. కోహ్లీ గొప్ప ఆట‌గాడ‌ని ఒక‌టి లేదా రెండు మూడు మ్యాచ్ ల‌లో రాణించ‌క పోయినంత మాత్రాన ఎలా తీసి వేస్తామంటూ ప్ర‌శ్నించాడు.

ఈ త‌రుణంలో బీసీసీఐ బాస్ దాదా చేసిన ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. ఎలా ఆడాలో కోహ్లీకి తెలుసు. వ‌ర‌ల్డ్ లో గొప్ప ఆట‌గాడు. ఇలాగే ఆడాల‌ని తాము చెప్ప‌లేమ‌న్నాడు.

ఆట‌గాళ్లు అన్నాక ఫామ్ లేమి త‌ప్ప‌క ఉంటుంది. ఎక్క‌డ త‌ప్పులు చేస్తున్నామో గుర్తించి ఆడితే బాగుంటుంద‌ని సూచించాడు. త‌ను ఏ ప్లేస్ లో ఆడాలో, ఎలా ఆడితే ప‌రుగులు వ‌స్తాయో కోహ్లీకి తెలిసినంత‌గా ఇంకెవ‌రికీ తెలియ‌ద‌ని స్ప‌ష్టం చేశాడు.

గ‌త 13 ఏళ్లుగా ఆడుతూ వ‌స్తున్నాడు. కోహ్లీకే కాదు స‌చిన్, ద్ర‌విడ్, అజ్జూ భాయ్ కూడా జ‌రిగింద‌న్నాడు గంగూలీ. నీ ఆట నీవు ఆడితేనే బెటర్ అని సూచించాడు.

Also Read : ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్-3లో ఇండియా

Leave A Reply

Your Email Id will not be published!